వేలాది జన్మలు...

ఒకసారి నారదుడికి తపస్సువల్ల చుట్టూ పుట్టలు పెరిగిన వ్యక్తి కనిపించాడు. స్వామి తననెప్పుడు కరుణిస్తాడో కనుక్కో మన్నాడతడు. నారదుడు సరేనని, వెళ్తోంటే.. నృత్యం చేస్తున్న వ్యక్తి కనిపించాడు.

Published : 16 Feb 2023 00:20 IST

కసారి నారదుడికి తపస్సువల్ల చుట్టూ పుట్టలు పెరిగిన వ్యక్తి కనిపించాడు. స్వామి తననెప్పుడు కరుణిస్తాడో కనుక్కో మన్నాడతడు. నారదుడు సరేనని, వెళ్తోంటే.. నృత్యం చేస్తున్న వ్యక్తి కనిపించాడు. అతడు కూడా తానెప్పుడు విముక్తుడయ్యేదీ ప్రభువును అడగమన్నాడు. కొన్నాళ్లకు నారదుడు మళ్లీ వచ్చాడు. చెదపుట్టలు పేరుకున్న వ్యక్తి దేవుడు తన గురించి ఏమన్నాడని అడిగాడు. మరో నాలుగు జన్మల తర్వాత ముక్తి లభిస్తుంది అని చెప్పాడు నారదుడు. అప్పుడతడు ‘నా శరీరాన్ని పుట్టలు కప్పేసే వరకూ గాఢ తపస్సు చేశాను. ముక్తి కోసం ఇంకా నాలుగు జన్మలు వేచి చూడాలా?’ అన్నాడు నిరాశగా. నారదుడు మౌనంగా అక్కణ్ణించి వెళ్లగా రెండో వ్యక్తి అదే ప్రశ్న అడిగాడు. ‘ఈ చింతచెట్టుకు ఎన్ని ఆకులున్నాయో అన్ని జన్మలు ఎత్తితే గానీ నీకు మోక్షం లభించదట’ అన్నాడు నారదుడు. ‘అవునా! మొత్తానికి నాకు మోక్షం లభిస్తుందన్నమాట’ అన్నాడు సంతోషంగా. అప్పుడు ఆకాశవాణి ‘ఈ క్షణమే నీకు విముక్తి లభిస్తుంది నాయనా’ అని పలికింది. ఎన్నో జన్మ లనగానే నిరుత్సాహంతో తపస్సు ఆపేస్తాననక సహనం, అకుంఠిత దీక్షలను ప్రదర్శించడమే ఆ కృపకు కారణం.

గోవిందం ఉమామహేశ్వర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని