మహా విశిష్టం.. ఆదిత్యహృదయం

రామ రావణ యుద్ధం భీకరంగా జరుగుతోంది. రాముడు రావణుడి శిరస్సులు ఖండిస్తుండగా ఓ తల కిందపడగానే ఆ స్థానంలో మరో తల మొలుస్తోంది.

Published : 13 Apr 2023 00:23 IST

రామ రావణ యుద్ధం భీకరంగా జరుగుతోంది. రాముడు రావణుడి శిరస్సులు ఖండిస్తుండగా ఓ తల కిందపడగానే ఆ స్థానంలో మరో తల మొలుస్తోంది. అప్పుడిక ఆదిత్య హృదయం జపించి విల్లెక్కుపెట్టి బాణాలు వదిలాడు. రావణుడు పడిపోయాడు. రామరావణ యుద్ధ సన్నివేశ మిది. అరుణాచలంలో శేషాద్రి స్వామి అవదూత దీన్ని గురించి ఓ నిగూఢ అర్థం తెలియజేశారు. కామక్రోధాలు రాక్షసుల వంటివి. రాక్షసులు నిశాచరులు. చీకటిలోనే కామ క్రోధాలు విజృంభిస్తాయి. వ్యక్తిలో అలాంటి గుణాలు ఉన్నంత వరకు ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలను లోబరచుకోవడం సాధ్యం కాదు. జ్ఞానజ్యోతి కాంతులను వెదజల్లినప్పుడే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. కామక్రోధాలూ, రాక్షసత్వం నశిస్తాయి. అటుపై ఇంద్రియాలు విషయతపన లేక అణగారిపోతాయి.
రావణుడు కామక్రోధాలు మూర్తీభవించిన నిండు విగ్రహం. నిశాచరుల నియంత. అతడి పది తలలూ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలకు నిదర్శనం. శ్రీరామచంద్రుడు తలలన్నింటినీ ఛేదించినా రావణుడు జీవించే ఉన్నాడంటే అతడిలో కామక్రోధాలు నశించలేదని అర్థం. ఆదిత్యహృదయ పఠనంతో ఆ ప్రదేశమంతా వెలుగు నిండిపోయింది. అంధకారం అంతరించిపోయింది. కామక్రోధాలు అదృశ్యమయ్యాయి- అని విపులీకరించారు అవదూతస్వామి. ఆదిత్యహృదయానికి అసాధ్యమెంది ఏదీ లేదన్నారు మహర్షులు.

బాలకౌసల్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని