అప్పుడే ప్రశాంతత

అనునిత్యం ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితుల వల్ల కొందరు దారి తప్పుతుంటారు. ఫలితంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, బాధలు అనుభవిస్తూ లక్ష్యాన్ని చేరడంలో ఇబ్బంది పడుతుంటారు.

Published : 08 Jun 2023 00:04 IST

అనునిత్యం ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితుల వల్ల కొందరు దారి తప్పుతుంటారు. ఫలితంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, బాధలు అనుభవిస్తూ లక్ష్యాన్ని చేరడంలో ఇబ్బంది పడుతుంటారు. సన్మార్గానికి బదులు విరుద్ధమైన దారిని ఎంపిక చేసుకోవడం వల్లనే అలాంటి దుష్పరిణామాలు కలుగుతాయి. తాము కోరుకున్న వాటిని అక్రమంగా అయినా పొందాలి, అవసరమైన కంటే అధికంగా సంపాదించాలి- లాంటి దురాశతో వెంపర్లాడుతుంటారు. ఈ చెడు ఆలోచనల వల్లే దుస్థితి కలుగుతుందని ఏసు తన ప్రబోధల్లో (మత్తయి 24:12) చెప్పారు. దైవం చెప్పిన మాటలను, చేసిన మంచి పనులను నిరంతరం మననం చేసుకుంటూ, సత్యమార్గంలో పయనించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఏసుప్రభువుతో పాటు తోటివారి ప్రేమను కూడా పొంది ప్రశాంతంగా ఉండగలుగుతాం. అక్రమ మార్గాన్ని ఎంచుకుంటే ఎప్పటికైనా పరిస్థితి అధోగతేనని గ్రహించాలి.

పూసపాటి విజయరాజు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని