త్వష్టా

విష్ణుసహస్రనామావళిలో ఇది 52 వది. ‘త్వష్టా’ అంటే త్వష్ట ప్రజాపతి.. సృష్టికర్త అని అర్థం. ఆయనే విశ్వకర్మ. ఆ ప్రజాపతి శిల్పాన్ని ఎన్నో రకాలుగా చెక్కుతుంటాడు.

Published : 15 Jun 2023 00:57 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 52 వది. ‘త్వష్టా’ అంటే త్వష్ట ప్రజాపతి.. సృష్టికర్త అని అర్థం. ఆయనే విశ్వకర్మ. ఆ ప్రజాపతి శిల్పాన్ని ఎన్నో రకాలుగా చెక్కుతుంటాడు. అదంతా చిత్రంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ శిల్పి లాగానే శ్రీమహావిష్ణువు కూడా నానావిధ రూపాలతో, నామాలతో దర్శనమిస్తుంటాడు. అంతా ఆయన చిత్రమే. ఆ చిత్రాన్ని మనం కనుక్కోలేం. కానీ ఆ నామాలను, రూపాలను మననం చేసుకుంటూ ఆయన అనుగ్రహం పొందవచ్చునన్నది ఈ నామంలో ఉన్న అంతరార్థం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని