తలుపులు లేని ఇల్లు

భక్త కబీర్‌దాసు కథల్లో కనిపించని మర్మం దాగి ఉంటుంది. ఒక రాజు తనకున్న ఆరు భవనాలు చాలక ఏడోది నిర్మించేందుకు వేలాది చెట్లను నరికించి చెరువును పూడ్పించాడు.

Published : 27 Jul 2023 00:04 IST

క్త కబీర్‌దాసు కథల్లో కనిపించని మర్మం దాగి ఉంటుంది. ఒక రాజు తనకున్న ఆరు భవనాలు చాలక ఏడోది నిర్మించేందుకు వేలాది చెట్లను నరికించి చెరువును పూడ్పించాడు. కానీ ఒక సందేహం కలిగి కులగురువును పిలిచి అందులో లోపాలుంటే చెప్పమన్నాడు. గురువు భవనమంతా కలియతిరిగి బిగించిన తలుపులే ఇందులో లోపం అంటూ చెప్పాడు. గురువుకు మతి భ్రమించింది అనుకున్నాడు రాజు. దీన్నెందుకు కట్టించావని గురువు అడిగితే నివసించేందుకని బదులిచ్చాడు రాజు. ‘ఏదో రోజున నిన్నీ భవనం నుంచి బయటకు తీసుకెళ్తారు. అదే శ్మశానం. తలుపులు లేకుంటే లోపలా బయటా అన్న ప్రశ్న రాదు. అందుకే తలుపులే లోపమన్నాను. సొంతిల్లు అనేది భ్రమ. ఎక్కడికి వెళ్తే ఇక తిరిగి రామో అదే అసలైన సొంతిల్లు. దాన్నే పరమపదం అంటాం. బతికుండగా నివసించేది మనిల్లు అనుకుంటాం. నిజానికి దాన్ని ఖాళీచేసి వెళ్లాల్సిన రోజు ఒకటుంటుందని గుర్తురాదు. ‘యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ’ అంటూ గీతలో కృష్ణుడు చెప్పిందదే. ఈ భవన నిర్మాణానికి పూర్వం అనేక జీవులు, చెట్లు ఈ స్థలంలో నివసించేవి. ఇన్ని ప్రాణులను నిరాశ్రయులను చేసి వాటి హక్కును హరించడం నీ అంతరంగానికే నచ్చలేదు. అందుకే ఇందులో లోపం ఉందని నీకే అనిపించింది’ అంటూ వివరించారు గురువు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని