దైవాన్నే వేడుకోవాలి

ముహమ్మద్‌ (సఅసం) మస్జిదులో ఉండగా ఒక వ్యక్తి వచ్చాడు. అతడు నమాజు పూర్తయ్యాక ‘దేవా! నన్ను కటాక్షించు’ అన్నాడు. అది విని దైవ ప్రవక్త ‘వేడుకునే విషయంలో తొందరపడ్డావు. నమాజ్‌ అయ్యాక మొదట దేవుని స్తోత్రం చేసి దరూదె షరీఫ్‌ చదవాలి.

Published : 10 Aug 2023 00:27 IST

ముహమ్మద్‌ (సఅసం) మస్జిదులో ఉండగా ఒక వ్యక్తి వచ్చాడు. అతడు నమాజు పూర్తయ్యాక ‘దేవా! నన్ను కటాక్షించు’ అన్నాడు. అది విని దైవ ప్రవక్త ‘వేడుకునే విషయంలో తొందరపడ్డావు. నమాజ్‌ అయ్యాక మొదట దేవుని స్తోత్రం చేసి దరూదె షరీఫ్‌ చదవాలి. ఆ తర్వాతే దుఆ కోరాలి’ అన్నారు. దుఆ అంటే అర్థింపు, వేడుకోలు అని అర్థం. ప్రవక్త అలా చెబుతుండగానే ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతడు నమాజు చేసుకున్నాక అల్లాహ్‌ను స్తుతించాడు. దరూదె షరీఫ్‌ పఠించాడు. అప్పుడు ప్రవక్త ‘ఇప్పుడు దుఆ వేడుకో, అది నెరవేరుతుంది. అల్లాహ్‌ సన్నిధిలో ఈ విధంగా దాసుడు పెట్టుకునే మొరను తప్పనిసరిగా స్వీకరించడం జరుగుతుంది. తమ ఆశలు, అవసరాలను నివేదించుకునే ముందు అల్లాహ్‌ను ఆరాధించాలి. దుఆ నిరంతరం చేస్తూనే ఉండాలి. సుఖ దుఃఖాల్లో, కలిమిలేముల్లో, ఎప్పుడు దేని గురించి అయినా దేవుణ్ణే వేడుకోవడం విశ్వాసి లక్షణం. వేరెవరినో యాచించడం కంటే దేవుణ్ణే అర్థించాలి’ అంటూ వివరించారు ప్రవక్త.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని