త్రికకుద్ధామః

విష్ణుసహస్రనామావళిలో ‘త్రికకుద్ధామః’ అనేది 61 వది. ‘కకుత్‌’ పదానికి ఎద్దు మూపురం అని అర్థం. ‘త్రికకుత్‌’ అంటే మూడు ఎడ్ల మూపురాల్లా ఉండే త్రికూట పర్వతం.

Published : 17 Aug 2023 00:06 IST

విష్ణుసహస్రనామావళిలో ‘త్రికకుద్ధామః’ అనేది 61 వది. ‘కకుత్‌’ పదానికి ఎద్దు మూపురం అని అర్థం. ‘త్రికకుత్‌’ అంటే మూడు ఎడ్ల మూపురాల్లా ఉండే త్రికూట పర్వతం. ఆ పర్వతం మీద నివసిస్తాడు కనుక స్వామికి ఆ పేరొచ్చింది. నిఘంటుపరంగా త్రికకుత్‌ అంటే చాలా అర్థాలున్నాయి. వాటిలో మూడు రాజ చిహ్నాలు కలిగినవాడు, మూడు గుణ వర్గాలకు ఆశ్రయమైనవాడు అనే అర్థాలున్నాయి. అంటే ఊర్ధ్వ, మధ్య, అధో లోకాలకు ఆధారభూతుడని.. జాగృత, స్వప్న, సుషుప్తి- అనే మూడు అవస్థల్లో వ్యాపించి ఉన్నవాడని.. ఇలా ఈ నామం శ్రీమహావిష్ణువు విశేషాలను వివరిస్తోంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని