ఉన్నా కనిపించవు..

భూమి ప్రయాణించడం, వాతావరణమంతా ఆక్రమించుకున్న గాలి ప్రసరించడం లాంటివేవీ మన కళ్లËకు కనిపించవు. వాటిని మనం చూడనంత మాత్రాన అవి లేవని కాదు కదా!

Published : 17 Aug 2023 00:07 IST

భూమి ప్రయాణించడం, వాతావరణమంతా ఆక్రమించుకున్న గాలి ప్రసరించడం లాంటివేవీ మన కళ్లËకు కనిపించవు. వాటిని మనం చూడనంత మాత్రాన అవి లేవని కాదు కదా! అలాంటివి అసంఖ్యాకంగా ఉన్నాయి. ఆధునిక సాంకేతికత వెలికి తీసిన ఎన్నో ఆవిష్కరణలు అనాదిగా సృష్టిలో ఉన్నవే. వాటిని కనుక్కోటానికే శతాబ్దాల సమయం పట్టింది. ఆత్మ, పరమాత్మల విషయమూ అంతే. ఒక ప్రాణి గతించిన తర్వాత జరిగే పయనం కూడా మన చుట్టూనే అల్లుకొని ఉంటుందంటారు. కానీ మనకు అంతుపట్టదు. మనం సంసార సాగరాన్ని దాటడానికి ఎంత ప్రయత్నిస్తామో ఆత్మను చైతన్యవంతం చేసుకోవడానికి కూడా అంతే కృషిచేయాలి. వయసులో కష్టపడి ఆర్జించిన ధనాన్ని మదుపు చేస్తే.. వృద్ధాప్యంలో ఆదుకున్నట్లు- మనం సాధించుకున్న ఆత్మ చైతన్య దీప్తి దేహ, జన్మ మార్పుల యానంలో అక్కరకు వస్తుందన్నది మహర్షుల ప్రబోధ. 

నాగిని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని