అకాల మరణాల్లేవు..

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి పరిపాలనా కాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదంటారు. ఆ విషయాన్ని బలపరిచే ఉదంతాలు అనేకం రామాయణ మహాకావ్యంలో చూస్తాం.

Updated : 24 Aug 2023 05:44 IST

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి పరిపాలనా కాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదంటారు. ఆ విషయాన్ని బలపరిచే ఉదంతాలు అనేకం రామాయణ మహాకావ్యంలో చూస్తాం. ఆదికవి వాల్మీకి విరచిత సంక్షిప్త రామాయణంలో ‘నపుత్ర మరణం కించిద్ద్రక్ష్వం పురుషాః క్వచిత్‌..’ అన్నారు. రామరాజ్యంలో తండ్రి కంటే ముందు పుత్రులు మరణించడం అన్నది లేదు. రుషివాక్యం సత్యదూరం కాదు కదా!

నిర్దస్యుర భవల్లోకో నానర్థం కశ్చిదస్పృశత్‌

నచస్మవృద్ధా బాలానాం ప్రేత కార్యాణి కుర్వతే

వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని ఈ శ్లోకానికి ‘రామరాజ్యంలో దొంగలు లేరు. పిల్లలకు ప్రేతకార్యం చేసే అవసరం ఎన్నడూ ఎక్కడా కలగలేదు’ అనేది భావం. ఆ కాలంలో ప్రజలెవ్వరినీ అకాలమృత్యువు హరించలేదంటూ తులసీదాసు రామాయణంలోనూ లిఖితమైంది. కంకంటి పాపరాజు ఉత్తర రామాయణంలో ‘సుతులు లేక కలంగు సుదతు లెక్కడ లేరు’ అంటూ భరతుడు శ్రీరామచంద్రుడికి తెలియ జేయడం కనిపిస్తుంది. ఇందులోనే ‘ధర్మాభిదానమంత కడు నిక్కమొనర్చె ముదుసళ్లనైనను గడియబోక’ అనే ప్రయోగం ఉంది. రామరాజ్యంలో ప్రజలెవ్వరూ బాధపడలేదు. లోకం ధర్మబద్ధంగా నడిచింది. అకాల మరణాలు సంభవించవు- అనేది భావం.                 శ్రీమయి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని