పవిత్రం

విష్ణుసహస్రనామావళిలో ‘పవిత్రం’ అనేది 62 వది. పరమ పావన స్వరూపుడు శ్రీమహావిష్ణువు. ఇక అంతకంటే పవిత్రమైన అంశం లోకంలో వేరొకటి లేదు.

Updated : 24 Aug 2023 05:42 IST

విష్ణుసహస్రనామావళిలో ‘పవిత్రం’ అనేది 62 వది. పరమ పావన స్వరూపుడు శ్రీమహావిష్ణువు. ఇక అంతకంటే పవిత్రమైన అంశం లోకంలో వేరొకటి లేదు. అంతటి పవిత్రుడి వద్దకు వెెళ్లేటప్పుడు, ఆయన నామం జపించేటప్పుడు లేదా ఆ స్వామిని తలచుకునేటప్పుడు.. మనసా వాచా కర్మణా ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఆలోచించుకోవాలి. దైవ కార్యాలన్నీ అంత పవిత్రంగా ఆచరించాలని భావం. ఈ సూచన ఈ నామంలో స్ఫురిస్తుంది. 

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని