మరణానికి ఆవల..

ఏసును నమ్మిన ప్రతి ఒక్కరూ ఓ నిరీక్షణతో ఉంటారు. ఎందుకంటే మరణం తర్వాత జీవితం అంతమైపోదు. ఆవల మరో జీవితం ఉంది. అదే శాశ్వతమైంది. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత.. అది దేవుడి దగ్గరికి వెళ్తుంది.

Published : 07 Sep 2023 00:18 IST

సును నమ్మిన ప్రతి ఒక్కరూ ఓ నిరీక్షణతో ఉంటారు. ఎందుకంటే మరణం తర్వాత జీవితం అంతమైపోదు. ఆవల మరో జీవితం ఉంది. అదే శాశ్వతమైంది. ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత.. అది దేవుడి దగ్గరికి వెళ్తుంది. నిరంతరం దేవుడితో గడపటమే అక్కడ నిత్యకృత్యం. దేవదూతలతో కలిసి ప్రభువును ప్రస్తుతిస్తూ, ఆయన సన్నిధిలో నివసించడం ఆనందకరం. తనను నమ్మినవారికి ఆ అవకాశం కలుగుతుందని (హెబ్రి 10:23) వాగ్దానం చేశాడు. మనలో ఎంత నిజాయితీ ఉన్నప్పటికీ.. ఒక్కోసారి మాట తప్పే అవకాశం ఉంది. కానీ దేవుడలా కాదు, మహోన్నతుడు. అందువల్ల ఏసు పిలుపును ఆమోదించాలి. ఆయన చేసేదంతా మన మంచికేనని నమ్మాలి. ఈ సందర్భంగా పౌలు చెప్పిన మాటలు మననం చేసుకుందాం- ‘నేను బతుకుతున్నది క్రీస్తు కోసమే. మరణం మరింత శ్రేయోదాయకం.. (ఐ ఫిలిప్పి 1:21) మన ఆప్తులను కోల్పోయినప్పుడు భరించలేని ఆవేదనతో కుంగిపోతాం. ఆ సమయంలో మనవాళ్లు దేవాధిదేవుని సన్నిధిలో ఉన్నారని గనుక పూర్తి విశ్వాసంతో ఉంటే.. మనకెంతో ఓదార్పు కలుగుతుంది. ఎందుకంటే మనల్ని తన చెంతకు పిలిచినవాడు ఎంతో విశ్వసనీయుడు.    

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని