ఖురాన్‌లో సోదర ప్రేమ

ముహమ్మద్‌ ప్రవక్త ప్రాణ మిత్రుల్లో హజ్రత్‌ అలీ (ర) ఒకరు. ఆయన కుమారుడైన ముహమ్మద్‌ బిన్‌ హనఫీయాను కలిసిన ఓ వ్యక్తి ‘మీ నాన్న నీ తమ్ముళ్లిద్దరితో ఎంతో ప్రేమగా ఉంటూ.. నీ పట్ల మాత్రం చాలా వివక్ష చూపిస్తున్నాడు’ అన్నాడు.

Published : 07 Sep 2023 00:18 IST

ముహమ్మద్‌ ప్రవక్త ప్రాణ మిత్రుల్లో హజ్రత్‌ అలీ (ర) ఒకరు. ఆయన కుమారుడైన ముహమ్మద్‌ బిన్‌ హనఫీయాను కలిసిన ఓ వ్యక్తి ‘మీ నాన్న నీ తమ్ముళ్లిద్దరితో ఎంతో ప్రేమగా ఉంటూ.. నీ పట్ల మాత్రం చాలా వివక్ష చూపిస్తున్నాడు’ అన్నాడు. అలా అన్నదమ్ముల మధ్య గొడవపెట్టే ప్రయత్నం చేశాడు. ఆ మాటలను తిప్పికొడుతూ ‘నా సోదరులు హాసన్‌, హుసైన్‌ (ర) - మా నాన్నకు రెండు చెంపలైతే.. నేనాయన చేతిని. చెంపలకు హాని కలగకూడదని చేతులను అడ్డుగా పెట్టు కున్నారు. అంటే మేమంతా ఒకే దేహంలోని భాగాలం’ అన్నారు హనఫీయా. తమలో ఎవరికి కష్టం కలిగినా.. అది తనకే కలిగినట్లు బాధపడతారు సోదరులు. అన్న దమ్ములు, అక్కచెల్లెళ్ల అనుబంధం ఎంతో విలువైన దని ఇస్లామీయ బోధనలు పేర్కొంటున్నాయి. ప్రవక్త మూసా (అలైహిస్సలామ్‌) తన పెద్దన్న శ్రేయస్సు కోసం ‘ప్రభూ! నన్నూ, నా సోదరుడు హారూన్‌ని క్షమించు. నీ కారుణ్య ఛాయలో మాకు చోటివ్వు! అతను నాకు చేయూతగా ఉండేలా, అతని ద్వారా నేను దృఢమయ్యేలా చెయ్యి’ అంటూ అల్లాహ్‌ను వేడుకున్నారు. ఆ మాటలు అల్లాహ్‌కు నచ్చి, వాటిని ఖురాన్‌లో (20:25) పొందు పరిచారు. ‘మీ సహోదరుల మధ్య సంబంధాలను చక్క బరచండి’ అని ఉద్బోధిస్తుంది ఖురాన్‌.

 ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని