బాధ్యతల నడుమే భగవద్భక్తి

ఒకసారి రామకృష్ణ పరమహంస వద్దకు ఉన్నతోద్యోగి అయిన ఓ గృహస్థ భక్తుడు వచ్చాడు. అతడు ‘గురువర్యా! నాకు కార్యాలయ ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు పెరిగిపోయాయి.

Updated : 14 Sep 2023 06:45 IST

కసారి రామకృష్ణ పరమహంస వద్దకు ఉన్నతోద్యోగి అయిన ఓ గృహస్థ భక్తుడు వచ్చాడు. అతడు ‘గురువర్యా! నాకు కార్యాలయ ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు పెరిగిపోయాయి. ఆధ్యాత్మిక సాధన కొనసాగించలేకపోతున్నాను. సంసార కర్తవ్యం నిర్వర్తిస్తున్నప్పుడు భగవంతుడిపై ధ్యాస ఉండటం లేదు. ఆధ్యాత్మిక కార్యకలాపాల కారణంగా ఇంటి విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను. రెంటికీ సమన్వయం కుదర్చటం ఎలా?’ అనడిగాడు. అది విన్న రామకృష్ణ  పరమహంస ‘నాయనా! అదంత కష్టమైనదేం కాదు. మనసులో దేనికెంత చోటు ఇవ్వాలో తెలిస్తే.. అయోమయం, అలజడులు ఉండవు. ఉదాహరణకు వడ్లు దంచే స్త్రీలనే చూడు.. ధాన్యం దంచుతుంటారు. రోట్లో గింజల్ని కదిలిస్తుంటారు. నలిగిన గింజల్ని పైకి తోడుతుంటారు. మరోవైపు పక్కనున్న చంటిబిడ్డని లాలిస్తుంటారు. అదే సమయంలో అటుగా వచ్చిన కొనుగోలుదారులతో బేరసారాలు సాగిస్తుంటారు. ఇన్ని పనులు చేస్తున్నా, రోకలి పోటుకు చేయి ఎక్కడ నలిగిపోతుందోనని మనసును ముప్పావు శాతం వేళ్ల మీదే ఉంచుతారు. అలాగే గృహస్థులు నాలుగోవంతు మనసుతో సంసార విధులు నిర్వహించాలి. మిగిలిన మూడొంతులూ భగవంతుడి మీదుంచాలి’ అంటూ హితవు పలికారు. 

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని