మదిని శోధిస్తుంది.. దేవుడి వాక్యం

గ్రీక్‌ పదం ‘బిబ్లియా’ నుంచి గ్రహించిందే ‘బైబిల్‌’. పుస్తకాల సమాహారం అనేది దీనికి అర్థం. ప్రపంచంలో అత్యధికంగా అచ్చవుతున్న గ్రంథమిది. బైబిల్‌ 1500 భాషల్లోకి తర్జుమా అయ్యింది.

Published : 14 Sep 2023 00:00 IST

గ్రీక్‌ పదం ‘బిబ్లియా’ నుంచి గ్రహించిందే ‘బైబిల్‌’. పుస్తకాల సమాహారం అనేది దీనికి అర్థం. ప్రపంచంలో అత్యధికంగా అచ్చవుతున్న గ్రంథమిది. బైబిల్‌ 1500 భాషల్లోకి తర్జుమా అయ్యింది. అనువాద ప్రక్రియకు టిండేల్‌ మహాశయుడు ఆద్యుడు. మొట్టమొదట ఆదిమ భాష అరబిక్‌లో లిఖితమైంది. ఏసుక్రీస్తు మాట్లాడిన భాష కూడా అదే. బైబిల్‌ను వ్యతిరేకించిన ఎందరో రాజులు, చక్రవర్తులు.. దాన్ని నాశనం చేద్దామని ప్రయత్నించారు. కానీ బైబిల్‌ను అంతమొందిద్దాం అనుకున్నవారే అంతమైపోయారు. అది దేవుడి వాక్కు కనుక.. గతించకపోగా నానాటికీ మరింత ప్రాచుర్యం పొందింది. గ్రీక్‌, లాటిన్‌ భాషల నుంచి 60 మంది ఉద్ధండ పండితులు ఆంగ్లంలోకి తర్జుమా చేసిన- ‘కింగ్‌ జేమ్స్‌ బైబిల్‌’ ప్రామాణికమైంది. వివిధ దేశాలు కోట్లాది ప్రతులు ప్రచురించాయి. దైవ వాక్కు కోసం ప్రజలు ఎంత దాహార్తితో ఉన్నారో దీన్ని బట్టి తెలుస్తోంది. మొత్తానికి మనమంతా దేవుడి వాక్యాన్ని నిరంతరం స్మరించుకోవాలి. అది మన మదిలో మెదిలే ఆలోచనలను శోధిస్తుందని గుర్తుంచుకోవాలి.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు