మితాహారం.. అమితారోగ్యం
ముహమ్మద్ ప్రవక్త (స) కాలంలో మదీనా పట్టణంలో కొందరు వైద్యులకు పని ఉండేది కాదు. వారి వద్దకు రోగులు వచ్చేవారు కాదు.
ముహమ్మద్ ప్రవక్త (స) కాలంలో మదీనా పట్టణంలో కొందరు వైద్యులకు పని ఉండేది కాదు. వారి వద్దకు రోగులు వచ్చేవారు కాదు. ఒకసారి వైద్యులు ప్రవక్తను కలిసి- తమ వద్దకు ఒక్క రోగి కూడా రావడం లేదని మొరపెట్టుకున్నారు. దానికాయన ‘ఇక్కడి ప్రజలు బాగా ఆకలేస్తే తప్ప అన్నం తినరు. కడుపు పూర్తిగా నిండక ముందే తినటం ఆపేస్తారు. వారు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటానికి కారణం మితాహార అలవాటే’ అన్నారు. ప్రవక్త (స) తమ సహచరులకు ఆహార పద్ధతులను వివరించేవారు. ఒకసారి కొందరు శిష్యులు తాము భోజనం చేసినాగానీ ఆకలి తీరడం లేదు అనడంతో.. ‘మీరు కుటుంబసభ్యులతో కలిసి తినండి. అల్లాహ్ పేరు పలికి తినండి’ అన్నారు ప్రవక్త. అంతా కలిసి తినడం వల్ల ఇద్దరి అన్నం ముగ్గురికి, ముగ్గురి అన్నం నలుగురికి సరిపోతుంది. కలిసి తినడం వల్ల అందరికీ తృప్తి కలుగుతుంది. ప్రవక్త చేతిని ఆహారంలో ముంచేవారు కాదు. మూడు వేళ్లతోనే తినేవారు. ఆయనెన్నడూ ఒంటరిగా తినేవారు కాదు. ‘సాటివారికి ఆహారం అందిస్తే.. దేవుడు శుభం చేకూరుస్తాడు’ అనేవారు.
ముహమ్మద్ ముజాహిద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
-
JEE Main 2024: జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు