దైవదూత సమాధానం

ఒకసారి ఓ వ్యక్తి ప్రవక్త (స) సమక్షంలోనే మహనీయ అబూబకర్‌ (ర)ను అడ్డూ అదుపూ లేకుండా తిట్లతో దూషిస్తున్నాడు. అతని తిట్లను మౌనంగా వింటూ, చిరునవ్వు చిందిస్తున్నారు మహనీయులు.

Published : 05 Oct 2023 00:25 IST

కసారి ఓ వ్యక్తి ప్రవక్త (స) సమక్షంలోనే మహనీయ అబూబకర్‌ (ర)ను అడ్డూ అదుపూ లేకుండా తిట్లతో దూషిస్తున్నాడు. అతని తిట్లను మౌనంగా వింటూ, చిరునవ్వు చిందిస్తున్నారు మహనీయులు. చివరికి హజ్రత్‌ అబూబకర్‌ సహనం సన్నగిల్లింది. బదులుగా ఆయన కూడా ఓ కఠినమైన మాటన్నారు. ఆయన నోటి నుంచి ఆ మాట వెలువడగానే ప్రవక్త (స) ముఖంలో అయిష్టత కనిపించింది, అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. హజ్రత్‌ అబూబకర్‌ ఆయన్ను అనుసరించారు. ‘ఇదేమిటి, అతను నన్ను దూషిస్తుంటే.. మీరు మౌనం వహించి చిరునవ్వుతో కనిపించారు. కానీ నేను బదులివ్వగానే అసంతృప్తి కనబరిచారు’ అనడంతో.. ప్రవక్త (స) ‘నువ్వు మౌనంగా ఉన్నంతసేపూ ఒక దైవదూత నీతోపాటు ఉండి, నీ తరఫున అతడికి సమాధానం ఇస్తున్నాడు. కానీ నువ్వు జవాబివ్వడం మొదలెట్టగానే దైవదూత స్థానంలో సైతాన్‌ వచ్చేశాడు. నేను సైతాన్‌తో పాటు కూర్చోలేనుగా’ అన్నారు.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని