అనుత్తమః

విష్ణుసహస్రనామావళిలో ఇది 80వది. ‘అనుత్తమః’ అంటే సర్వ శ్రేష్ఠుడని అర్థం. అంత కంటే ఉత్తముడు వేరెవరూ విశ్వంలో ఎంత వెతికినా కనిపించరు. ఏ కోణంలో చూసినా ఉత్తమోత్తమ లక్షణాలు జగన్నాథునిలోనే కనిపిస్తాయి.

Published : 04 Jan 2024 00:03 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 80వది. ‘అనుత్తమః’ అంటే సర్వ శ్రేష్ఠుడని అర్థం. అంత కంటే ఉత్తముడు వేరెవరూ విశ్వంలో ఎంత వెతికినా కనిపించరు. ఏ కోణంలో చూసినా ఉత్తమోత్తమ లక్షణాలు జగన్నాథునిలోనే కనిపిస్తాయి. ఆ స్వామిని అనుసరించాలనుకునే భక్తులు ఎవరైనా ఉత్తమ లక్షణాలతో ఉండగలగాలి. అప్పుడే అది నిజమైన భక్తి అని నిరూపణ అవుతుంది. సర్వోత్తముడు చూపిన మార్గాన్ని బట్టి నడుచుకుంటే జగత్తు అంతా ఉత్తమంగా ఉంటుందని భావం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని