తపస్సు మనకూ సాధ్యమే

తపస్సు అంటే తల కిందికి, కాళ్లు పైకి చాపి ఎండలో మాడుతూ, వర్షంలో తడుస్తూ, నిద్రాహారాలు మాని.. రోజుల తరబడి దైవాన్ని ధ్యానిస్తూ గడపటం అనుకుంటారు మనలో చాలామంది. సామాన్యులమైన మనకు ఇది సాధ్యం కాదని, మహర్షులు మాత్రమే అడవుల్లో, కొండ గుహల్లో తపస్సు చేస్తారని, దాని వల్ల పాపాలు నశిస్తాయని- భావిస్తారు.

Published : 11 Jan 2024 00:10 IST

పస్సు అంటే తల కిందికి, కాళ్లు పైకి చాపి ఎండలో మాడుతూ, వర్షంలో తడుస్తూ, నిద్రాహారాలు మాని.. రోజుల తరబడి దైవాన్ని ధ్యానిస్తూ గడపటం అనుకుంటారు మనలో చాలామంది. సామాన్యులమైన మనకు ఇది సాధ్యం కాదని, మహర్షులు మాత్రమే అడవుల్లో, కొండ గుహల్లో తపస్సు చేస్తారని, దాని వల్ల పాపాలు నశిస్తాయని- భావిస్తారు. ‘తపసా కిల్బిషం హంతి’ అన్నారు. అంటే తపస్సు పాపాలను పోగొడుతుందని కదా అర్థం. మహర్షులే తపస్సు చేస్తారని మన మనసులో ఏర్పడిన ముద్రలను పోగొట్టడానికి భగవద్గీతలో ‘శారీరక, వాచిక, మానసిక- అంటూ మూడు రకాల తపస్సులున్నాయ’ని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు.

దేవతలు, గురువులు, మహనీయులను పూజించడం, అహింస, సత్ప్రవర్తన మొదలైనవి శారీరక తపస్సు. ఎదుటివారికి నచ్చే విధంగా మాట్లాడటం, ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడం, నిరంతర అధ్యయనం వంటివి వాచిక తపస్సు. మనో శుద్ధి, మౌనం, ఆత్మనిగ్రహం మొదలైనవి మానసిక తపస్సు. కనుక వీటిని ఆచరించగలిగితే సామాన్యులమైన మనం తపస్సు చేసినట్లే అవుతుంది. గొప్ప శాంతి నెలకొంటుంది. అలాంటి తపో దీక్షాపరుల సమక్షంలో ఇతరులకు కూడా ప్రశాంతత చేకూరుతుంది.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని