జనకుడే ఆదర్శం

పురాణేతిహాసాల్లో ‘విఘ సాశువు’ అనే పదం ఉంది. అంటే ప్రాతః కాలం, సాయంకాలం కూడా ఉన్న అన్నాన్ని విభజించి..

Published : 18 Jan 2024 00:07 IST

పురాణేతిహాసాల్లో ‘విఘ సాశువు’ అనే పదం ఉంది. అంటే ప్రాతః కాలం, సాయంకాలం కూడా ఉన్న అన్నాన్ని విభజించి.. అతిథులు, దేవతలు, పితృ దేవతలు, కుటుంబ సభ్యులను ముందుగా తినమని.. మిగిలిన అన్నం తాము తింటారు. ఆధునిక కాలంలో ఈ ధర్మాన్ని పెద్దగా అనుసరించడంలేదు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లో.. గృహస్థాశ్రమం వైపే తూకం మొగ్గు చూపింది.

గృహస్థాశ్రమంలో కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ సాధక బాధకాలను ఓర్పుతో జయిస్తూ క్షమ-క్రోధం, దానం - అదానం, భయం - అభయం, నిగ్రహం - అనుగ్రహం..  ఈ ద్వంద్వాలను- విఘ సాశువులు సమయోచితంగా ప్రదర్శించాలి. జనక మహారాజు గృహస్థాశ్రమంలో ‘విఘ సాశువు’గా జీవిస్తూ జనక మహర్షి అయ్యాడు. ఈ ధర్మ వ్యవస్థ ఎప్పటికీ శిరోధార్యమే.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని