కపిలేశ్వరుడికి పవిత్రోత్సవం

తిరుమల క్షేత్ర పాలకుడైన శివయ్య శేషాచల కొండల దిగువన స్వయంభువుగా వెలసిందే కపిల తీర్థం. ఏటా ఆషాఢంలో మూడు రోజుల పాటు ఇక్కడ కపిలేశ్వరుడికి పవిత్రోత్సవాలు (జులై 20 నుంచి) ఘనంగా నిర్వహిస్తారు. తిరుమల పర్యవేక్షణలోని ఏకైక శివాలయం ఇది. దీనికి సంబంధించి ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది.

Updated : 15 Jul 2021 01:53 IST

తిరుమల క్షేత్ర పాలకుడైన శివయ్య శేషాచల కొండల దిగువన స్వయంభువుగా వెలసిందే కపిల తీర్థం. ఏటా ఆషాఢంలో మూడు రోజుల పాటు ఇక్కడ కపిలేశ్వరుడికి పవిత్రోత్సవాలు (జులై 20 నుంచి) ఘనంగా నిర్వహిస్తారు. తిరుమల పర్యవేక్షణలోని ఏకైక శివాలయం ఇది. దీనికి సంబంధించి ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. కృతయుగంలో కపిల మహాముని పాతాళలోకంలోని భోగవతీ నదీతీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేవాడు. ఓరోజు పుడమిని ఛేదిస్తూ పెరుగుతున్న శివలింగాన్ని గమనించిన బ్రహ్మదేవుడు గోవు రూపంలో ప్రత్యక్షమై పాలధారతో అభిషేకిస్తూ ‘ఇక పెరగవద్దు’ అంటూ గోవు కాలి గిట్టను లింగంపై ఉంచి ప్రార్థించాడు. విష్ణుమూర్తి పక్కనే ఉన్నాడు. ఇలా కపిలేశ్వరుడైన స్వామి ఇక్కడ లింగ పీఠం వద్ద తెలుపు, మధ్యలో పసుపు పచ్చ, పైన తేనె రంగులో ప్రకాశిస్తుంటాడు. భోగవతీ నది భూమిపైకి వచ్చి ఆలయం వద్ద సరోవరంగా మారిందట. పవిత్రో త్సవాల్లో భాగంగా గణపతి, వల్లీదేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి, కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, చండికేశ్వరస్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాలు జరుపుతారు.

 - బొబ్బా రాజేంద్రప్రసాద్‌, తిరుపతి, న్యూస్‌టుడే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని