ఉత్తమ గురువు...

వైద్యుల్లో మూడు రకాలుంటారు. ఒకరు నాడి పరీక్షిస్తారు. ఔషధం ఇస్తారు. తమ పాటికి తాము వెళ్లిపోతూ ‘ఔషధం వేసుకో! అర్థమైందా?’ అంటారు. వీరు అధమ రకం వైద్యులు. అలాగే కొందరు గురువులు ఉపదేశం చేసి వెళ్లిపోతారు.

Updated : 04 Nov 2021 06:43 IST

వైద్యుల్లో మూడు రకాలుంటారు. ఒకరు నాడి పరీక్షిస్తారు. ఔషధం ఇస్తారు. తమ పాటికి తాము వెళ్లిపోతూ ‘ఔషధం వేసుకో! అర్థమైందా?’ అంటారు. వీరు అధమ రకం వైద్యులు. అలాగే కొందరు గురువులు ఉపదేశం చేసి వెళ్లిపోతారు.

మధ్యరకం వైద్యులు రోగికి ఔషధం ఇచ్చి వేసుకోమంటారు. మందు మింగడానికి వ్యతిరేకత చూపితే నానా రకాలుగా చెప్పి చూస్తారు. మధ్యరకం గురువులు కూడా అంతే. ఉపదేశం చేసి, సాధనామార్గాలు చూపుతారు. ఇక ఉత్తమ కోవకు చెందిన వైద్యులు తీయని మాటలతో రోగి ఔషధం పుచ్చుకోకుంటే బలవంతంగానయినా మింగేలా చేస్తారు. ఉత్తమ తరగతి గురువులూ అంతే. కఠిన మాటలతో నయినా శిష్యులను ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింప చేస్తారు.

‘గురువుకు త్యాగబుద్ధి చాలా అవసరం’ అనేవారు రామకృష్ణ పరమహంస. ఆయనోసారి దక్షిణేశ్వరం కాళీ ఆలయంలో పూజ చేసి దగ్గర్లోనే ఉన్న తన ఆవాసానికి వెళ్తున్నారు. అప్పుడు గృహస్థ భక్తుడొకరు వచ్చి ‘అయ్యా! ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించాలంటే కుటుంబ కర్తవ్యం ఎంత కాలం కొనసాగించాలి?’ అనడిగాడు. దానికి పరమహంస ‘కుటుంబ కనీస అవసరాలు తీరేంత వరకు బాధ్యత వహించాలి. పిల్లలు తమ కాళ్ల మీద నిలబడ్డ తర్వాత, ఇక వాళ్ల భారాన్ని మోసే అవసరం లేదు. పక్షిపిల్ల స్వయంగా ఆహారం సేకరించడం నేర్చిన తర్వాత తల్లి వద్దకు వెళ్లినా అది ముక్కుతో పొడిచి వెళ్లగొడుతుంది’ అన్నారు.

- చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని