రాజుగారి నిజాయితీ

సుల్తాన్‌ నాసరుద్దీన్‌ ప్రజల ఆదరణ పొందిన రాజు. ధనాగారంనుంచి రూపాయి కూడా సొంత ఖర్చులకు వాడుకోలేదాయన. టోపీలు కుట్టి అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన భార్య కూడా దర్జా దర్పం లేకుండా నిరాడంబరంగా

Updated : 23 Dec 2021 05:23 IST

సుల్తాన్‌ నాసరుద్దీన్‌ ప్రజల ఆదరణ పొందిన రాజు. ధనాగారంనుంచి రూపాయి కూడా సొంత ఖర్చులకు వాడుకోలేదాయన. టోపీలు కుట్టి అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన భార్య కూడా దర్జా దర్పం లేకుండా నిరాడంబరంగా ఉండేది. ఒకరోజు మహారాణి వంట చేస్తుండగా చెయ్యి కాలింది. బాధ తట్టుకోలేక భర్త దగ్గరకు వచ్చి ‘మహారాజా! వంట చేయడం కష్టంగా ఉంది. సాయం చేసేందుకు ఒక సేవకురాలిని నియమించండి’ అనడిగింది. అందుకు రాజు ‘ప్రజల సొమ్మును ప్రజలకే వినియోగించాలనే నియమం పెట్టుకున్నాను కదా! కనుక ప్రభుత్వ ఖజానా నుంచి చిల్లిగవ్వ కూడా సొంతానికి వాడుకోలేం. మరి వచ్చే కొద్దిపాటి ఆదాయంలో సేవకురాలిని పెట్టగలనా? ఇదంతా నీకు తెలిసిందే కదా!’ అనడంతో మహారాణి మౌనంగా వెళ్లిపోయింది. ఇది ఉలమాలు చెప్పిన కథ.

 - తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని