అవ్యయం

విష్ణుసహస్రనామావళిలో ఇది పదమూడోది. ఎప్పటికీ వ్యయం కానివాడు, తరుగు లేనివాడు అని అర్థం.

Updated : 08 Sep 2022 01:05 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది పదమూడోది. ఎప్పటికీ వ్యయం కానివాడు, తరుగు లేనివాడు అని అర్థం. తనను చేరినవారిని మళ్లీ జనన మరణ చక్రంలో పడనీయనివాడు, వినాశం కానివాడు, వికారం లేనివాడు- అంటూ స్వామి తత్త్వాన్ని అనునసరించి సందర్భానుసారంగా వివరణలు కనిపిస్తున్నాయి. సాధారణంగా కనిపించేది ఏదైనా పరిణామం చెందటం సహజం. పరిణామశీలమైన వస్తువు నశించి తీరుతుంది. కానీ భగవానుడు అలా పరిణామం చెందే వస్తు సముదాయంలోకి చేరని శాశ్వతుడు అనేది ఈ నామానికి స్థూలార్థం.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని