అసూయే అడ్డుతెర

దేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలు పర్యటిస్తూ త్యాగయ్య తన స్వరసుమాలతో ఆయా దేవతామూర్తుల్ని అర్చించారు. కంచిక్షేత్రంలోని ఏకామ్రనాథస్వామిని, కామాక్షిదేవిని, వరదరాజస్వామిని కీర్తించి తరించారు. ‘శివశివశివ యనరాదా!

Updated : 29 Sep 2022 04:40 IST

దేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలు పర్యటిస్తూ త్యాగయ్య తన స్వరసుమాలతో ఆయా దేవతామూర్తుల్ని అర్చించారు. కంచిక్షేత్రంలోని ఏకామ్రనాథస్వామిని, కామాక్షిదేవిని, వరదరాజస్వామిని కీర్తించి తరించారు. ‘శివశివశివ యనరాదా! ఓరీ భవభయబాధల నణచుకోరాదా!’, ‘గానమూర్తే శ్రీకృష్ణవేణు గానలోల త్రిభువనపాల పాహి..’, ‘శ్రీగణపతిని సేవించరారే శ్రితమానవులారా..’ వంటి మధురగీతాల్ని వివిధ దేవతా మూర్తుల మీద రచించారు. అలా శ్రీవేంకటేశ్వర స్వామి వైభవాన్ని కనులారా వీక్షించేందుకు తిరుమలకు వచ్చారు. తీరా ఏడుకొండలపైకి చేరుకున్నాక శ్రీనివాసుని దర్శన సమయం ముగిసిపోయింది. శ్రీవారి సేవల్లో భాగంగా తెరపడింది. ఒక్కసారిగా త్యాగయ్య నీరు కారిపోయారు. భగవంతునికీ, తనకీ మధ్య అహంకారమే పరదాగా పరచుకుందని మథనపడుతూ ‘తెరతీయగ రాదా నాలోని.. తిరుపతి వేంకటరమణ మత్సరమను...’ అంటూ ఆర్తితో ఆలపించారు. పరమాత్మకూ, మనకూ మధ్య అసూయ, అహంభావాలు అడ్డుతెరగా నిలుస్తున్నాయని త్యాగయ్య అంతటి మహానుభావుడు అనుభవపూర్వకంగా చెప్పారు.

- సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని