కర్మఫలం వెంటాడుతూనే ఉంటుంది!

కురుక్షేత్రయుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చేందుకు వెళ్లాడు. ఆయన ‘నా వందమంది పుత్రుల్ని పోగొట్టుకున్నాను. నువ్వు పూనుకుంటే ఈ అనర్థం జరిగేది కాదుగా’ అన్నాడు.

Published : 22 Dec 2022 00:16 IST

కురుక్షేత్రయుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చేందుకు వెళ్లాడు. ఆయన ‘నా వందమంది పుత్రుల్ని పోగొట్టుకున్నాను. నువ్వు పూనుకుంటే ఈ అనర్థం జరిగేది కాదుగా’ అన్నాడు. పరమాత్మ నవ్వి ‘మామా! ఇందులో నువ్వూ నేనూ చేయగలిగిందేమీ లేదు. నీ కర్మఫలం అనుభవించావు అంతే!’ అన్నాడు. ‘అదేంటో వివరించు’ అన్నాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు ‘50 జన్మల క్రితం నువ్వొక కిరాతకుడివి. ఒకసారి వేటలో నీకు పక్షులు దొరకలేదు. ఆఖరి ప్రయత్నంగా ఒక గువ్వలజంటకు గురిపెట్టగా అవీ తప్పించు కున్నాయి. నువ్వు క్రోధావేశంతో ఆ చెట్టుమీది వంద పక్షి గుడ్లను విచ్ఛిన్నం చేసి వెళ్లిపోయావు. వాటిË గర్భశోకం నిన్నిలా వెంటాడింది’ అన్నాడు. ‘నిజమే కావచ్చు కానీ దానికి 50 జన్మలు వేచి ఉండాల్సి రావడం ఏమిటి?’ అన్నాడు. ‘మామా! నువ్వు వందమంది పుత్రులను పొందాలంటే ఎన్ని యజ్ఞ యాగాదులు, ధర్మకార్యాలు చెయ్యాలి? అవన్నీ చేసి వందమంది పుత్రులు జన్మించగానే కర్మ తన పని తాను చేసుకుంది’ అంటూ వివరంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోయాడు.

కర్మఫలం అంతటిది. జన్మల తరబడి సంపాదించుకొన్న పుణ్యం నశించడానికి ఒక్క జన్మ చాలు. అందుకే పుణ్యాచరణే భగవదేచ్ఛ అనుకుని ముందుకు సాగడమే కర్తవ్యం’ అంటూ తల పంకించాడు శ్రీకృష్ణుడు.

ధూర్తి సుబ్రహ్మణ్యకుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని