దాతృత్వానికి ప్రేరణ ఖురాన్‌

ఒకసారి కొందరు నిరుపేదలు ప్రవక్త (స) సన్నిధికి వచ్చారు. వారి దుస్తులపై అనేక చిరుగులున్నాయి. వారి ముఖాల్లో ఆకలి ఛాయలు కనిపించాయి.

Published : 29 Dec 2022 00:24 IST

ఒకసారి కొందరు నిరుపేదలు ప్రవక్త (స) సన్నిధికి వచ్చారు. వారి దుస్తులపై అనేక చిరుగులున్నాయి. వారి ముఖాల్లో ఆకలి ఛాయలు కనిపించాయి. ఆ దీన స్థితిని చూసిన ప్రవక్త హృదయం ద్రవించింది. వెంటనే బిలాల్‌ (రజి) అనే అనుచరుణ్ణి పిలిచి అజాన్‌ ఇవ్వ మన్నారు. నమాజ్‌ ముగిసిన తర్వాత ‘ఏ దేవుణ్ణి స్మరిస్తూ మీరంతా హక్కులను కోరుకుంటారో ఆ దేవుడికి భయపడండి! బంధుమిత్రు లతో అనుబంధాలను తెంచుకోవద్దు. అల్లాహ్‌ సదా మిమ్మల్ని గమనిస్తున్నాడని తెలుసుకోండి! ఆయనకు భయపడండి. రేపటి కోసం ఏం సమకూర్చుకున్నారో మీరంతా తరచి చూసుకోండి’ అంటూ ఖురాన్‌ పఠించారు. ఆ వాక్యాలతో ప్రేరణ పొందినవారంతా తోచినంత సాయం చేశారు. కొందరు బస్తాల నిండా ఖర్జూరాలను తీసుకొచ్చారు. చూస్తుండగానే, దుస్తులు ఆహార పదార్థాలు, వస్తుసామగ్రి కుప్పలుగా పోగయ్యింది. ఆ ఔదార్యాన్ని చూసిన ప్రవక్త ముఖం మేలిమి బంగారంలా మెరిసింది.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని