శిష్యుడి అసహనం

ఒకసారి రామకృష్ణ పరమహంస మాధవ అనే శిష్యునితో కలిసి కాశీయాత్రకు బయల్దేరారు. దారిలో వారికెన్నో అనుభవాలయ్యాయి.

Updated : 09 Feb 2023 02:18 IST

కసారి రామకృష్ణ పరమహంస మాధవ అనే శిష్యునితో కలిసి కాశీయాత్రకు బయల్దేరారు. దారిలో వారికెన్నో అనుభవాలయ్యాయి. ఒకరోజు అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఆకలితో అలమటిస్తోన్న ఒక పేద కుటుంబం కనిపించింది. వాళ్లకి కొన్నాళ్ల పాటు భోజనానికి లోటు లేకుండా కొంత ధనం ఇవ్వమని పురమాయించారు పరమహంస.

శిష్యుడు తన అసహనాన్ని అణచుకునేందుకు ప్రయత్నిస్తూ ‘దారి పొడుగునా సాయాలు చేస్తున్నారు. ఉన్న సొమ్మంతా ఇలా ఖర్చయిపోతే మన యాత్ర ఎలా సాగుతుంది గురువర్యా? ఇక ప్రయాణం ఆపేసి మనమిక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో!’ అన్నాడు. రామకృష్ణ పరమహంస ప్రశాంతంగా చూసి ‘మనం కాశీకి వెళ్లి పరమశివుని దర్శించుకోకున్నా ఫరవాలేదు. కళ్లెదురుగా ఉన్న సజీవ దైవాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా? మానవసేవే మాధవసేవ అని మర్చిపోయావా?!’ అన్నారు. గురువర్యుల ఆంతర్యం గ్రహించక తొందరపడి మాట్లాడినందుకు పశ్చాత్తాపం చెందాడు శిష్యుడు.

వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని