ఉన్నచోటు నుంచే దీవించు!

ప్రభువు తక్కువ మాట్లాడి ఎక్కువ శుభాలు అందించాడు. ఆయన పలుకు కాంతిని ప్రసరించింది. శాంతిని ప్రకటించింది. సత్యాన్ని చూపింది. జీవ చైతన్యాన్ని కలిగించింది.

Updated : 09 Feb 2023 02:15 IST

ప్రభువు తక్కువ మాట్లాడి ఎక్కువ శుభాలు అందించాడు. ఆయన పలుకు కాంతిని ప్రసరించింది. శాంతిని ప్రకటించింది. సత్యాన్ని చూపింది. జీవ చైతన్యాన్ని కలిగించింది. కొత్తమార్గం వైపు పయనింపచేసింది. ‘జీవిత రహస్యాలు’ గ్రంథానికి క్రీస్తు చెప్పిన భాష్యాన్ని నేటికీ గ్రహిస్తున్నాం. అది విశ్వవాణి అయి లోకమంతటా వ్యాపించింది. ఆయన ప్రియశిష్యుడు యోహాను సుస్వరాలు వినిపిస్తున్న క్రీస్తును చూశాడు. పర లోకపు దేవుని వాక్కే మన చెంతకు అపార కృపాప్రవాహమై వస్తోందని గ్రహించలేకపోతున్నాం. ఇప్పటికైనా ఆ సందేశాలన్నింటినీ శ్రద్ధగా విని ఆస్వాదిద్దాం, ఆచరిద్దాం- అంటూ ప్రజల కళ్లు తెరిపించాడు. ఒకసారి ‘ప్రభూ! నా సేవకుడు పక్షవాతంతో లేవలేకపోతున్నాడు’ అని క్రీస్తుకు విన్నవించాడు. ప్రభువు బయల్దేరబోతే ‘నిన్ను నా ఇంటికి ఆహ్వానించేంత అర్హత లేదు. ఉన్నచోటు నుంచే దీవించు ప్రభూ’ అంటూ క్రీస్తు పలుకులోని అద్భుత శక్తికి పట్టం కట్టాడు.

డాక్టర్‌ దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని