పది ఆజ్ఞలు

తాను సృష్టించిన మనుషులు ఒక పద్ధతి, కట్టడి లేకుండా యథేచ్ఛగా, విచ్చలవిడిగా ఉండటం గమనించాడు యెహోవా. వారిని క్రమశిక్షణలో పెట్టాలనుకుని తన భక్తుడు మోషే ద్వారా పది ఆజ్ఞలు అందించాడు.

Published : 29 Jun 2023 00:10 IST

తాను సృష్టించిన మనుషులు ఒక పద్ధతి, కట్టడి లేకుండా యథేచ్ఛగా, విచ్చలవిడిగా ఉండటం గమనించాడు యెహోవా. వారిని క్రమశిక్షణలో పెట్టాలనుకుని తన భక్తుడు మోషే ద్వారా పది ఆజ్ఞలు అందించాడు. టెన్‌ కమాండ్‌మెంట్స్‌గా ప్రసిద్ధి చెందిన ఆ దశాజ్ఞలు-

  • నేనే మీ దేవుణ్ణి.
  • ఆకాశంలో, భూమిమీద, నేల కింది నీళ్లలో.. ఎక్కడా ఏ రూపాన్నీ, విగ్రహాన్నీ చేసి పూజించ కూడదు.
  •  యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు.
  • వారంలో ఒకరోజు విశ్రాంతిదినం. ఆరోజు కుటుంబసభ్యులు, పనివారు, పశువులు.. ఎవరూ ఏ పనీ చేయకూడదు. కారణం ఆరు రోజులు సృష్టిపనులు చేసిన దేవుడు ఏడో రోజున విశ్రమించాడు.
  • నువ్వు దీర్ఘాయుష్షుతో ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించు.
  • నరహత్య కూడదు.
  • వ్యభిచారం చేయకూడదు.
  • దొంగతనం నిషిద్ధం. 
  • అబద్ధ సాక్ష్యాలు వద్దు.
  • పొరుగువారి ఇంటిని గానీ, భార్యను గానీ, దాసును గానీ అతనికి చెందిన మరి దేన్ని గానీ ఆశించవద్దు. ఈ ఆజ్ఞలను భక్తితో, నిజాయతీతో ఆచరించేవారికి పరలోక ప్రాప్తి నిశ్చయం.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని