స్వర్గానికి మార్గం

ఒకసారి హజ్రత్‌ ఆయిషా సిద్దీఖా వద్దకు ఓ నిరుపేద మహిళ యాచించేందుకు వచ్చింది. ఆమె వెంట ఇద్దరు పిల్లలున్నారు.

Published : 20 Jul 2023 01:10 IST

ఒకసారి హజ్రత్‌ ఆయిషా సిద్దీఖా వద్దకు ఓ నిరుపేద మహిళ యాచించేందుకు వచ్చింది. ఆమె వెంట ఇద్దరు పిల్లలున్నారు. ఆ సమయంలో కారుణ్యమూర్తి (స) కుటీరంలో ఖర్జూరాలు తప్ప మరేమీ లేవు. అందువల్ల హజ్రత్‌ ఆయిషా ఆ పండ్లనే ఆమెకు దానం చేశారు. ఆ మహిళ వాటిని బాలికలిద్దరికీ సమంగా పంచింది. చిన్నారులు తమకు ఇచ్చిన ఖర్జూరాల్లోంచి తల్లికి కొన్ని తీసి ఇచ్చారు. వాళ్ల మమకారం ఆయిషాకు ముచ్చట కలిగించింది. ఈ ఘటనను ప్రవక్త (స) రాగానే వివరించారామె. ఇది విన్న ప్రవక్త (స) ‘ఆడపిల్లలకు ప్రేమ పంచుతూ వారి పట్ల సమాదరణ చూపితే.. రేపటిరోజున నరకాగ్నికి అడ్డుతెరగా నిలిచి స్వర్గానికి మార్గం చూపుతారు’ అన్నారు.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు