రక్షించేందుకే వచ్చాడు

ఏసు, యేసు పదాలకు యెహోషువా, జాషువా అనే హెబ్రూ భాషా పదాలు మూలమని చెబుతారు. ఏసు అంటే రక్షించేవాడని అర్థం. అజ్ఞానమనే చీకటి నుంచి ప్రజల్ని వెలుగులోకి నడిపించటమే రక్షించడమంటే.

Published : 27 Jul 2023 00:11 IST

సు, యేసు పదాలకు యెహోషువా, జాషువా అనే హెబ్రూ భాషా పదాలు మూలమని చెబుతారు. ఏసు అంటే రక్షించేవాడని అర్థం. అజ్ఞానమనే చీకటి నుంచి ప్రజల్ని వెలుగులోకి నడిపించటమే రక్షించడమంటే. మానవతను విస్మరించడం, నైతికమార్గం వదిలి తోటివారిని హింసించడం, హత్యలు, పరకాంతా వ్యామోహాలు, ఇతరుల సొమ్మును ఆశించడం, దేవుడు గీసిన గీత దాటడం- లాంటివన్నీ పాపాలే. వాటితో చీకటికూపంలో పడిపోయినట్టే. అక్కడి నుంచి ప్రజలను సంరక్షించడమే దేవుడు ప్రజలకు ఇచ్చిన హామీ. దాన్ని నెరవేర్చేవాడే రక్షకుడు. అందుకోసం ప్రభువు మానవ రూపంలో జన్మించాడు. ఆ ప్రియకుమారుడే ఏసు! ‘వస్తాడు.. వస్తాడు..’ అంటూ ఎదురుచూసిన మెస్సయా ప్రవక్తే ఏసుక్రీస్తు. ‘నేనే వెలుగు. నేనే సత్యం. నేనే జీవం. నేనే మార్గం’ అంటూ తన వాక్కు వినిపించాడాయన.

డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని