అహింసామూర్తి అపూర్వ కానుక

మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న కాలంలో తిరుగుబాటు ఉద్యమంలో నిందితుడిగా జైలుకు వెళ్లారు. అలా జైల్లో ఉన్న సమయంలో గాంధీజీ తన గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను ఆదివారాల్లో చదువుకునే ఏర్పాటు చేశారు జైలర్‌ స్మట్స్‌.

Updated : 03 Aug 2023 04:41 IST

హాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న కాలంలో తిరుగుబాటు ఉద్యమంలో నిందితుడిగా జైలుకు వెళ్లారు. అలా జైల్లో ఉన్న సమయంలో గాంధీజీ తన గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను ఆదివారాల్లో చదువుకునే ఏర్పాటు చేశారు జైలర్‌ స్మట్స్‌. అలా మహాత్ముడు తన తాత్విక ఆలోచనలను, పుస్తక పఠనాన్ని అక్కడ కూడా కొనసాగించారు. మిగతా రోజుల్లో ఆయన పాదరక్షలు తయారుచేసేవారు. శిక్ష గడువు తీరి, తాను విడుదలయ్యే రోజున జైలర్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాదరక్షల జతను స్నేహ పూర్వకంగా అందించారు అహింసామూర్తి. ఆ అభిమానానికి జైలర్‌ చలించిపోయారు. ఆ కానుకను సదా స్మరించుకునేవారు. ఒక సందర్భంలో ‘గాంధీజీ ఆధ్యాత్మిక చింతన నా జీవితంపై ప్రగాఢ ముద్ర వేసింది. ఆయన బహుమానంగా ఇచ్చిన చెప్పుల జత నా దృష్టిలో అపూర్వం, అసాధారణం. వాటిలో కాలు పెట్టడానికి మనసొప్పటం లేదు. అందుకే ఆ కానుకను భద్రంగా దాచుకున్నాను. ఆయన చూపే ప్రేమకు సాక్ష్యాలవి’ అంటూ ఉద్విగ్నతకు లోనయ్యారు స్మట్స్‌.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని