చూపుల పరదా

ఒకరోజు ముహమ్మద్‌ ప్రవక్త (స) నడచుకుంటూ వెళ్తుండగా చూసిన ఓ మహిళ దగ్గరగా వచ్చి హజ్‌ గురించి తనకున్న సందేహం అడిగింది.

Published : 17 Aug 2023 00:08 IST

కరోజు ముహమ్మద్‌ ప్రవక్త (స) నడచుకుంటూ వెళ్తుండగా చూసిన ఓ మహిళ దగ్గరగా వచ్చి హజ్‌ గురించి తనకున్న సందేహం అడిగింది. ప్రవక్త వెంట ఉన్న అనుచరుడు ఆ స్త్రీని తదేకంగా చూడసాగాడు. అది గమనించిన దైవ ప్రవక్త ఆ యువకుడి తలను పక్కకు తిప్పారు. ఇతరస్త్రీలను కన్నెత్తి చూడరాదని, యాదృచ్ఛికంగా నయినా సరే పరాయి స్త్రీపై దృష్టి పడితే.. వెంటనే చూపు మరల్చుకోవాలన్నది ప్రవక్త ప్రబోధ. ‘పరస్త్రీని తదేకంగా చూస్తే అది కంటితో వ్యభిచారం చేసినట్లవుతుంది. మొదటి చూపు నీదే కానీ, రెండో చూపు సైతాన్‌ది’ అన్నారు ప్రవక్త. ఉమ్మె ఖలాద్‌ (రజి) అనే మహిళ కొడుకు యుద్ధంలో మరణించాడు. కొడుకు పరిస్థితిని విచారించడానికి ఆమె ప్రవక్త సన్నిధికి వచ్చారు. ఆ విషాదంలోనూ ఆమె పరదాలోనే ఉండటం చూసి ‘ఇంతటి దుఃఖంలోనూ తాపీగా పరదా ధరించి వచ్చావా?’ అని కొందరడిగారు. దానికామె ‘నేను పుత్రుణ్ణి కోల్పోయాను.. కానీ బిడియాన్ని కాదు కదా’ అంటూ బదులిచ్చింది. వేరొకరిని నిశితంగా చూడకూడదనే నియమం స్త్రీలకూ వర్తిస్తుంది. పర పురుషుల్ని కళ్లు విప్పార్చుకుని చూడరాదు. స్త్రీ పురుషులిద్దరూ చూపులను అధీనంలో ఉంచుకోవాలన్నది ఇందులో సారాంశం. 

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని