శ్రీరాముని ఆరాధనా మహిమ

రామసేతు నిర్మాణం కోసం వానర సేన ఎంతో కోలాహలంగా కొండలు, బండలు తెచ్చి సముద్రంలో వేస్తోంది.

Published : 19 Oct 2023 00:17 IST

రామసేతు నిర్మాణం కోసం వానర సేన ఎంతో కోలాహలంగా కొండలు, బండలు తెచ్చి సముద్రంలో వేస్తోంది. అది చూసేందుకు ఉడుత, ముంగిస వచ్చాయి. రాముడి పట్ల అంతులేనిఛలీ ఆరాధన ఉన్న ఉడుత ‘రామకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం’ అంది. ముంగిసకు ఆ మాట నచ్చలేదు. ‘మనం వెళ్తే ఆ కోతుల కాళ్ల కింద పడి నలిగిపోతాం, వద్దు!’ అంది. ‘భయమెందుకు? జాగ్రత్తగా ఉందాం’ అంటూ ఉడుత నచ్చజెప్పినా.. ముంగిస వద్దంది. ఉడుత దాన్ని వదిలి, తాను వెళ్లింది. రాముడికి నమస్కరించి,  ఒడ్డునున్న ఇసుకలో దొర్లి, వారధి వద్దకు వెళ్లి దులపసాగింది. ‘ఉడుతా భక్తి’ అనే సూక్తి అలా వచ్చిందే. రాముడు ఉడుత భక్తికి పరవశుడై, దాని వీపుమీద ప్రేమగా నిమిరాడు. అలా దాని మీద అందమైన చారలు ఏర్పడ్డాయి. ముంగిస అసూయతో మండిపడుతూ.. ‘ఇక నువ్వు నాతో రాకు. ఆ మచ్చలతో హేళన పాలవుతావు. బతకలేవు కూడా’ అంటూ చరచరా అడవిలోకి వెళ్లిపోయింది. ముంగిసతో తగాదా ఎందుకని పక్కనున్న పల్లెకు చేరింది ఉడుత. చెట్లపైనున్న పండ్లు తింటూ కాలం వెళ్లబుచ్చసాగింది. శ్రీరామచంద్రుని స్పర్శతో పునీతమైన ఉడుత కొరికిన పండ్లు కూడా తీయని రుచి పొందాయి. కానీ ముంగిస ఆప్తమిత్రుడు లేని లోటుతో దుఃఖించింది. మృగ భయంతో, విష సర్పాలతో పోరాటËంతో మాంసాహారిగా మిగిలింది. రాముడి సేవ చేయనందుకు బాధపడటమే కాక, ఉడుత వంటి మంచి మిత్రుని కోల్పోయినందుకు విచారించేది. అవకాశం వచ్చినప్పుడు సేవ చేయడానికి వెనుకంజ వేస్తే.. ఫలితం అలాగే ఉంటుందన్నది గురువుల ప్రబోధ.

బెహరా ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని