ఆ సొమ్ము నీకొద్దు

ముహమ్మద్‌ ప్రవక్త(స) ఓ వ్యక్తిని సద్‌ఖా విరాళాలు వసూలు చేయమన్నారు. అతడు సొమ్మును అప్పగిస్తూ ‘ఇది మీకు (ఖజానా) చెందింది, ఇది నాకు కానుకగా వచ్చింది’ అన్నాడు.

Published : 09 Nov 2023 00:38 IST

ముహమ్మద్‌ ప్రవక్త(స) ఓ వ్యక్తిని సద్‌ఖా విరాళాలు వసూలు చేయమన్నారు. అతడు సొమ్మును అప్పగిస్తూ ‘ఇది మీకు (ఖజానా) చెందింది, ఇది నాకు కానుకగా వచ్చింది’ అన్నాడు. అది విన్నంతనే ప్రవక్త అల్లాహ్‌ను స్తుతించి- ‘నేనూ మీలోని వ్యక్తినే. అల్లాహ్‌ అప్పగించిన బాధ్యతను నెరవేర్చేందుకు అతణ్ణి నియమిస్తే.. ఇలా అంటున్నాడు. ఇది నిజమైతే, అతడు తనింట్లోనే ఉండొచ్చుగా! అప్పుడు కానుకలెలా వచ్చేవి? జాగ్రత్త! మీలో ఎవరైనా ప్రజల నుంచి అన్యాయంగా ఏదైనా వసూలు చేస్తే.. ప్రళయదినాన ఆ వ్యక్తి ఆ వస్తువుతో అల్లాహ్‌ ముందు హాజరవుతాడు. నేను మీలో ఎవరినీ కూడా తలపై ఒంటెను లేదా మేకను మోస్తున్న స్థితిలో అల్లాహ్‌ను కలుసుకోవడాన్ని చూడాలని కోరుకోవడం లేదు’ అంటూ వివరించారు. ఆ తర్వాత ప్రవక్త(స) తన చేతులు పైకెత్తి ‘ఓ అల్లాహ్‌! నీ మాటను నేను చేరవేశాను’ అన్నారు. ఎవరైనా తన బాధ్యతను విస్మరించి, అక్రమార్జనకు పాల్పడటాన్ని, స్వార్థ ప్రయోజనాలను పొందటాన్ని ఇస్లాం నిషేధించింది. అలాంటి అక్రమాలను అరికట్టే విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని