అంతా ఇక్కడికి రావాల్సిందే!

బహలోల్‌ దానా ధార్మిక పండితులు. ఆయన సందేశాలు ఎంతో విజ్ఞతతో కూడుకుని ఉండేవి. గొప్పగొప్ప చక్రవర్తులు కూడా ఆయన ఉపదేశాలను అనుసరించేవారు. ఒకసారి ఆయన శ్మశానవాటికలో (ఖబరస్థాన్‌) కూర్చుని ఉన్నారు.

Published : 30 Nov 2023 00:44 IST

హలోల్‌ దానా ధార్మిక పండితులు. ఆయన సందేశాలు ఎంతో విజ్ఞతతో కూడుకుని ఉండేవి. గొప్పగొప్ప చక్రవర్తులు కూడా ఆయన ఉపదేశాలను అనుసరించేవారు. ఒకసారి ఆయన శ్మశానవాటికలో (ఖబరస్థాన్‌) కూర్చుని ఉన్నారు. అటుగా వచ్చిన రాజు హారూన్‌ రషీద్‌కు అక్కడ బహలోల్‌ దానా కనిపించడంతో ఆగి.. ‘ఎప్పుడూ ఈ శ్మశాన వాటికలోనే కాలం వెళ్లదీస్తున్నారు. అప్పుడప్పుడూ బాగ్దాద్‌ నగరానికి వచ్చి సంతోషంగా గడపవచ్చు కదా!’ అన్నారు. దానికాయన ‘మీ పట్టణవాసులు ఒక్కొక్కరుగా ఇక్కడికే వస్తున్నారు. అక్కడికొచ్చి నేనేం చేయను? నాకూ వాళ్లకూ తేడా ఒక్కటే. వాళ్లని మోసుకుని వస్తున్నారు, నేను నడుచుకుంటూ వస్తున్నాను’ అంటూ బదులివ్వడంతో ఆయన వెళ్లిపోయాడు. అంతలోనే మరో వ్యక్తి వచ్చి- ‘ఖబరస్థాన్‌లో ఎందుకున్నారు?’ అనడిగాడు. బహలోల్‌ దానా బదులిస్తూ.. ‘ఇక్కడున్న వారి వల్ల నాకెలాంటి ఇబ్బందీ లేదు. ఎవరూ నన్ను నిందించరు, అసూయ చెందరు. నా గురించి దుష్ప్రచారం చేయరు, అబద్ధాలు కల్పించరు. దెప్పినట్లుగా మాట్లాడరు. నేనిక్కడి నుంచి వెళ్లాక నా మీద ఇతరులకు చాడీలు చెప్పరు. ఆత్మ ప్రక్షాళనకోసం ఖురాన్‌ పఠనం చేయాలి, మృత్యువును గుర్తుంచుకోవాలి’ అంటూ చెప్పారు. మరణాన్ని గుర్తుచేసుకునేందుకు శ్మశానవాటికను సందర్శించడం ప్రవక్త సంప్రదాయం.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని