అరవయ్యేళ్ల ఆరాధనలు.. రెండు రొట్టెలు..

ఇజ్రాయెల్లో ఒక దాసుడు నిరంతరం దైవ ధ్యానంలో నిమగ్నుడై ఉండేవాడు. అతడు ఒక కొండపై ఆశ్రమాన్ని నిర్మించుకొని దైవధ్యానంలో గడిపేవాడు. అలా అరవయ్యేళ్లయ్యింది. ఒక వర్షాకాలంలో కొండ పక్కనున్న పల్లె ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతూ కనిపించింది.

Published : 21 Dec 2023 00:08 IST

జ్రాయెల్లో ఒక దాసుడు నిరంతరం దైవ ధ్యానంలో నిమగ్నుడై ఉండేవాడు. అతడు ఒక కొండపై ఆశ్రమాన్ని నిర్మించుకొని దైవధ్యానంలో గడిపేవాడు. అలా అరవయ్యేళ్లయ్యింది. ఒక వర్షాకాలంలో కొండ పక్కనున్న పల్లె ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతూ కనిపించింది. ఆకలికి తినేందుకు రెండు రొట్టెలను తీసుకొని కొండ దిగాడు. ఊళ్లో అతనికి ఒక స్త్రీ పరిచయమైంది. కొంతసేపు మాట్లాడేసరికి పరిచయం ప్రణయంగా మారింది. అది తప్పని తెలుసుకొని దగ్గర్లోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. అక్కడో వ్యక్తి ఆకలితో అలమటించడం చూసి తన వద్దనున్న రొట్టెలు ఇచ్చి, చెరువులో దిగాడు. ఈత రాక మునిగి చనిపోయాడు. అరవయ్యేళ్ల పాటు చేసిన దైవారాధన పుణ్యమంతా కొన్ని నిమిషాలు నిగ్రహం కోల్పోయిన పాపానికి తుడిచిపెట్టుకుపోయింది. కానీ చివరి నిమిషంలో చేసిన రొట్టెల దానంతో అతని పుణ్యఫలాల త్రాసు మొగ్గు చూపింది. దానం గొప్పదంటూ ముహమ్మద్‌ ప్రవక్త చెప్పిన ఈ గాథ ‘ఇబ్నె హిబ్బాన్‌’ గ్రంథంలోనిది.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని