అల్లాహ్‌ స్మరణతో దుఃఖం దూరం

ఓ పక్షీ నువ్వెంత అదృష్టవంతురాలివి. నాకూ నీలానే రెక్కలుంటే ఎంత బాగుండేది!

Published : 25 Jan 2024 00:01 IST

పక్షీ నువ్వెంత అదృష్టవంతురాలివి. నాకూ నీలానే రెక్కలుంటే ఎంత బాగుండేది! నువ్వు క్షణాల్లో చెట్టుకొమ్మను చేరి.. పండు తింటావు, ఎంచక్కా ఎగిరిపోతావు. నువ్వు దేవుడికెలాంటి లెక్కా చెప్పాల్సిన అవసరం లేదు. నీకెలాంటి శిక్షా లేదు. దైవ కృపతో నేను దారి పక్కన మొక్కనై పుడితే.. నా పక్క నుంచి ఒక ఒంటె నెమ్మదిగా నడుస్తూ నా కొమ్మలకున్న ఆకుల్ని నమిలితే ఎంత సంతోషం! నేను గడ్డిపరకను అయినా బావుండేది! నేనసలు పుట్టకుండానే ఉంటే బావుండేది! కాదు కాదు.. నాకు ఏమీ లేకుండా ఉంటే బావుండేది! అసలు మా అమ్మ నన్ను కనకుండా ఉండాల్సింది! నేను మతిమరపును అయ్యుంటే బావుండేది..

‘కొందరు సహచరులు ఇలాంటి భావనలు చేస్తూ రోదించేవారు. ప్రళయ బీభత్సం, మరణానంతర జీవితంలోని శిక్షల్ని తలచుకుని భీతిల్లేవారు. పాపభీతితో కంపించేవారు. నరకంలో వేదన అనుభవించాల్సి వస్తుందని భావిస్తూ.. పక్షిగానో, గడ్డిపరకగానో పుట్టి ఉంటే ఎంత బాగుండేది- అని విచారించేవారు. అల్లాహ్‌ స్మరణలో గడిపితే పరలోకంలో ఎలాంటి దుఃఖానికి చోటు ఉండదు’ అంటూ ముహమ్మద్‌ ప్రవక్త (స) చెప్పారో సందర్భంలో.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని