విశ్వజనని గోమాత

పురాణేతిహాసాలు గోవును విశ్వజనని, పూజ్యనీయం అంటూ కీర్తించాయి.  ఆవుపాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, మయం పంచగవ్యంగా ప్రసిద్ధి చెందాయి. గోవు మూపురం కింద వెన్నులో సూర్యరశ్మిని గ్రహించే ప్రాణశక్తితో కూడిన సూర్యనాడి ఉంటుంది.

Published : 01 Feb 2024 00:12 IST

పురాణేతిహాసాలు గోవును విశ్వజనని, పూజ్యనీయం అంటూ కీర్తించాయి.  ఆవుపాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, మయం పంచగవ్యంగా ప్రసిద్ధి చెందాయి. గోవు మూపురం కింద వెన్నులో సూర్యరశ్మిని గ్రహించే ప్రాణశక్తితో కూడిన సూర్యనాడి ఉంటుంది. మూపురంపై సూర్యకిరణాలు పడినప్పుడు సూర్యనాడి ఉత్తేజితమై సూర్యశక్తిని గ్రహించి ఆరోగ్యాన్ని పెంచి పోషించే బంగారురంగు గల రసాలను విడుదల చేస్తుంది. అందుకే ఆవుపాలు కొంచెం స్వర్ణవర్ణంతో కనిపిస్తాయి. గోక్షీరం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. బుద్ధిని వికసింపచేసి, సాత్విక గుణాన్ని వృద్ధిపరుస్తుంది. ‘కాశీఖండం’లో గోక్షీరాన్ని గంగా జలంతో పోల్చడం విశేషం. గోక్షీరం తేజస్సును, ఉత్సాహాన్ని అధికం చేస్తుంది. గర్భిణీలు ఆవుపాలు సేవించడం మంచిదంటారు. ఆవు వెన్న శాంతి, సత్వ గుణాలను ప్రసాదిస్తుంది. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల వాతావరణ కాలుష్యం దూరమవుతుంది. ప్రాణవాయువు వృద్ధిచెందుతుంది. అందుకే యజ్ఞయాగాదుల్లో ఆవునెయ్యిని ఉపయోగిస్తారు. గోమయం భూమిని సారవంతం చేస్తుంది. ఇన్ని సద్గుణాలకు నిలయమైన గోమాతను పూజిస్తూ, గోసంతతిని వృద్ధిపరచడం మానవాళికి ఎంతో శ్రేయస్కరం.

బాలకౌసల్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని