శివలింగంపై సూర్యకిరణాలు

మానుకోట జిల్లా గూడూరులోని శివాలయానికి త్రికూటేశ్వర ఆలయమని పేరు. పురాతనమైన ఈ ఆలయంలో పశ్చిమాన శివలింగం, దక్షిణాన శివపార్వతుల విగ్రహం ఉన్నాయి.

Published : 22 Feb 2024 00:09 IST

మానుకోట జిల్లా గూడూరులోని శివాలయానికి త్రికూటేశ్వర ఆలయమని పేరు. పురాతనమైన ఈ ఆలయంలో పశ్చిమాన శివలింగం, దక్షిణాన శివపార్వతుల విగ్రహం ఉన్నాయి. పూర్వం ఈ గ్రామంలో మాత్రమే గుడి ఉండటంతో పరిసర ప్రాంతాలవారు ‘గుడి ఉన్న ఊరు’ అంటూ పిలిచేవారట. ఆదే క్రమంగా గూడూరుగా మారిందంటారు. లింగ రూపంలో కాకుండా విగ్రహ రూప శివాలయం అరుదు కనుక స్థానికులు ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా, పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. ఆరు నెలలకోసారి అంటే ఉత్తరాయణ, దక్షిణాయన ఆరంభ సమయాల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భ గుడిలో ఉన్న శివలింగాన్ని తాకుతాయి. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల వారు దక్షిణామూర్తి కరుణాకటాక్షాలు తమ పిల్లలపై ప్రసరించాలని, ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు. గుడి గోడ వద్దనున్న పుట్టను పూడ్చాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా మరుసటి రోజుకు మళ్లీ ఏర్పడేదట. దాంతో పూడ్చటం మానేసి పూజించడం మొదలుపెట్టారు. ఇక్కడ శ్వేత నాగు కనిపిస్తుందని అర్చకులు, భక్తులు చెబుతుంటారు. ఆలయానికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. దూర ప్రాంతాలవారు గూడూరుకు 30 కి.మీ.దూరంలో ఉన్న మహబూబాబాద్‌ వరకు రైల్లో చేరుకుని, అక్కడి నుంచి బస్సులో వెళ్లొచ్చు.

ధనలక్ష్మి ఇంచెర్ల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని