పాపాలు తొలగంగ

మనిషి తెలిసీ తెలియక కొన్ని పాపాలు చేస్తుంటాడు. వాటి ఫలితాల్ని తొలగించుకోవటానికి తోడ్పడేదే దశపాపహర దశమి. జ్యేష్ఠ శుక్లపక్ష దశమిని (జూన్‌ 20) దశపాపహర దశమిగా చెబుతారు. ‘గంగోత్సవ

Updated : 17 Jun 2021 00:49 IST

సందర్భం

మనిషి తెలిసీ తెలియక కొన్ని పాపాలు చేస్తుంటాడు. వాటి ఫలితాల్ని తొలగించుకోవటానికి తోడ్పడేదే దశపాపహర దశమి. జ్యేష్ఠ శుక్లపక్ష దశమిని (జూన్‌ 20) దశపాపహర దశమిగా చెబుతారు. ‘గంగోత్సవ దశమి’ అని దీనికి మరోపేరు. గంగావతరణ జరిగింది ఈ రోజే. కఠినంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, పొంతనలేని, సమాజం వినలేని మాటలు మాట్లాడటం - ఈ నాలుగూ మాటల ద్వారా చేసే పాపాలు. తనది కాని ధనం/ వస్తువుల మీద వ్యామోహం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవటం - ఈ మూడూ మానసిక పాపాలు. అర్హత లేనివారికి దానం ఇవ్వటం, శాస్త్రం ఒప్పుకోని హింసను చేయటం, పర స్త్రీ/ పురుషుడి స్వీకరణ - ఈ మూడూ శరీరంతో చేసే పాపాలు. ఈ పది పాపాలు తొలగించుకోవటానికి ఈ రోజున వ్రతం ఆచరించాలని ‘వ్రతనిర్ణయ కల్పవల్లి’ గ్రంథం స్పష్టం చేస్తుంది. ఈ వ్రత విధానం స్కాంద పురాణంలో ఉంది. దీన్ని ఉత్తర భారతంలో పెద్ద ఎత్తున జరుపుతారు. వ్రతంలో భాగంగా గంగ, ఇతర నదుల్లో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. ఆ అవకాశం లేని వారు బావి, లేదా దగ్గరలోని నీటి వనరు వద్ద స్నానం చేసి, గంగాదేవిని ప్రతిమ లేదా కలశంలోకి ఆవాహన చేసి పూజిస్తారు. తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించి, ఆ తర్వాత శివుణ్ని ఆరాధిస్తారు.

రమా శ్రీనివాస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని