తీర్థం ఎలా తీసుకోవాలి..

గుడిలో దైవదర్శనానంతరం పూజారులు ‘అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, (ఆ దేవుడు / దేవత నామం) పాదోదకం పావనం శుభం’ అంటూ తీర్థం ఇస్తారు.

Published : 13 Apr 2023 00:23 IST

గుడిలో దైవదర్శనానంతరం పూజారులు ‘అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, (ఆ దేవుడు / దేవత నామం) పాదోదకం పావనం శుభం’ అంటూ తీర్థం ఇస్తారు. తీర్థం అంటే తరింపజేసేది. భగవంతుడి పవిత్ర పాదాలను స్పృశించిన తీర్థం అకాల మరణాన్ని సంభవించనీయదు. సర్వరోగాలనూ నివారిస్తుంది. తెలిసో, తెలియకో చేసిన పాపాలను తొలగిస్తుంది- అన్నది దీని భావం. భగవదార్చనకు ముందు అది జలం మాత్రమే. కానీ పూజానంతరం అందులో తులసి, శ్రీగంధం, కేసరి, పచ్చకర్పూరం మొదలైనవి కలిసి తీర్థంగా రూపాంతరం చెందుతుంది. ఇక మంత్ర ప్రభావంతో పవిత్రమవుతుంది. గోకర్ణంగా మలచిన చేతిని పురుషులు ఉత్తరీయంపై, స్త్రీలు పమిట చెంగుపై ఉంచి, పూజారి ఉద్ధరణితో ఇచ్చే తీర్థం గ్రహించాలి. భక్తిశ్రద్ధలతో ఒక్క చుక్క కూడా కింద పడకుండా, శబ్దం రాకుండా సేవించాలి. ఒక్కోసారి తీర్థం పంచామృతంతోనూ చేస్తారు. అటువంటి తీర్థం సేవించి, ఆ చేతిని తలపై రాసుకోకూడదు. వైష్ణవ సంప్రదాయంలో గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలి.

ప్రతాప వెంకట సుబ్బారాయుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని