విభూతి రేఖల సంకేతం
ఒకప్పుడు హైందవ ధర్మానికి ప్రతీకగా పురుషులు నుదుట గంధాన్ని, స్త్రీలు కుంకుమను మాత్రమే ధరించేవారు. నొసట నామం, త్రిపుండ్రం దిద్దుకునేవారు కాదు.
ఒకప్పుడు హైందవ ధర్మానికి ప్రతీకగా పురుషులు నుదుట గంధాన్ని, స్త్రీలు కుంకుమను మాత్రమే ధరించేవారు. నొసట నామం, త్రిపుండ్రం దిద్దుకునేవారు కాదు. రామాయణ, భారత, భాగవతాది పురాణేతిహాసాలు ఉద్భవించిన తర్వాత అవి ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోయాయి. అంతకు ముందు త్రిమూర్తులను సైతం నడిపించే శక్తి మరొకటుందని గాఢంగా నమ్మేవారు. శైవ, వైష్ణవ అంటూ విభేదాలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండేవారు. క్రమంగా విష్ణువును ఆరాధించే వారు, శివుణ్ణి పూజించేవారు.. రెండు వర్గాలుగా విడిపోయి కలహించుకోవడం ఆరంభించారు. నుదుట గంధం, కుంకుమలతో నిలువు నామాలు, విభూతి అడ్డరేఖలు అప్పుడే మొదలయ్యాయి. నుదుట మూడు విభూతి రేఖలనే త్రిపుండ్రం అంటారు. ఎవరి నమ్మకం వారిది, త్రిమూర్తులు అందరికీ ఆరాధ్యులేనంటారు ఆధ్యాత్మికవేత్తలు. 3 సంఖ్య బ్రహ్మ సంఖ్యగా భావిస్తారు. మూడు గీతల ఉద్దేశం అదే. నామధారణ అపమృత్యు దోషాలను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందన్నది భక్తుల విశ్వాసం.
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Atlee: ‘రాజారాణి’ టు ‘జవాన్’.. నేనెంతో గర్వపడుతున్నా: అట్లీ సతీమణి పోస్ట్
-
Airtel: ఎయిర్టెల్కు ట్రాయ్ రూ.2.81 కోట్ల జరిమానా
-
Gold Robbery: రూ.25 కోట్ల నగల చోరీ కేసులో కీలక పురోగతి
-
IPO: ఐపీఓకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దరఖాస్తు
-
Crime: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని.. నిప్పంటించిన తల్లి, సోదరుడు
-
ICC World Cup: వరల్డ్ కప్ లక్ష్యంగా.. ‘ఖలిస్థానీ ఉగ్రవాది’ పన్నూ బెదిరింపులు..!