నీలో లేని లోపం నీకు...

అంటూ మంత్రపుష్పం చివర్లో, ‘ఆవాహనం నజానామి నజానామి విసర్జనం’ అంటూ దేవీపూజ ఆఖరులో మనం క్షమా ప్రార్థన చదువుతాం. ‘నేను పాపాత్ముడిని...’ ‘అర్చనలో నాకు ఆవాహనం తెలీదు, విసర్జనమూ తెలీదు’ అని దీని అర్థం....

Published : 31 May 2018 01:29 IST

ధర్మ సందేహం
నీలో లేని లోపం నీకు...

మంత్రపుష్పంలో చేయని పాపాలు తీసుకోవడమనే అర్థం ఉందా?

- నరసింహరావు, విశాఖపట్టణం

‘పాపోహం పాపకర్మాహం, పాపాత్మా పాపసంభవః...’
అంటూ మంత్రపుష్పం చివర్లో, ‘ఆవాహనం నజానామి నజానామి విసర్జనం’ అంటూ దేవీపూజ ఆఖరులో మనం క్షమా ప్రార్థన చదువుతాం. ‘నేను పాపాత్ముడిని...’ ‘అర్చనలో నాకు ఆవాహనం తెలీదు, విసర్జనమూ తెలీదు’ అని దీని అర్థం.
ఆధ్యాత్మిక విద్యలో దీన్ని నైచ్యానుసంధానం అంటారు.
ప్రపంచలోని ఇతరులకందరికీ తనను ప్రతినిధిగా భావించుకొని, వారిలో ఉన్న...తనలో లేని లోపాన్ని తనకు ఆపాదించుకుని తనను, తనతో పాటు అందరినీ కరుణించాలని భగవంతుణ్ణి ప్రార్థించడం. నైచ్యానుసంధానం తనను తాను నిందించుకోవడం కాదు.భగవంతుడి సమక్షంలో శరణాగతి చేయడం మాత్రమే. ఇది గొప్ప వినయ ప్రకటన.. ఇది ఆ సాధకుడి నడవడికి అలంకారమే కానీ, చిన్నతనం కాదు. ఇది మన రుషులు మనకందించిన గొప్ప మార్గం.

- డా. పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని