నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ గుర్తింపు కలిగిన హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ముద్ర అగ్రికల్చర్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీస్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (ఎంఏఎస్‌డీఎంఎస్‌సీఎస్‌) తెలుగు...

Published : 07 Jun 2021 00:40 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
2000 మార్కెటింగ్‌ సూపర్‌వైజర్లు

భారత ప్రభుత్వ గుర్తింపు కలిగిన హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ముద్ర అగ్రికల్చర్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీస్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (ఎంఏఎస్‌డీఎంఎస్‌సీఎస్‌) తెలుగు రాష్ట్రాల్లో పని చేయడానికి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మార్కెటింగ్‌ సూపర్‌వైజర్లు.

మొత్తం ఖాళీలు: సుమారు 2000

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత

వయసు: 18-43 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకి రూ.10000+ ఇన్సెంటివ్స్‌ చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ముద్ర అగ్రికల్చర్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీస్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌, 15ఏ, 3-4-757/22, ఏపీహెచ్‌బీ బిల్డింగ్‌, రాఘవేంద్రస్వామి దేవాలయం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఎదురుగా, బర్కత్‌పుర, హైదరాబాద్‌-500027

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 15, 2021.


బీఐఎస్‌లో 28 సైంటిస్టులు

భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సైంటిస్ట్‌-బీ

మొత్తం ఖాళీలు: 28

విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, 2019/ 2020/ 2021లో గేట్‌ అర్హత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: వాలిడ్‌ గేట్‌ స్కోర్‌, షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 25, 2021.

వెబ్‌సైట్‌: https://bis.gov.in/


ప్రవేశాలు
నిక్‌మార్‌, పుణెలో పీజీ ప్రోగ్రాములు

పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్‌మార్‌) 2021 సంవత్సరానికిగానూ కింది పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* నిక్‌మార్‌ - పీజీ ప్రోగ్రాములు 2021 (మూడో రౌండ్‌) ప్రవేశాలు కల్పించనున్న ప్రాంగణాలు: పుణె, హైదరాబాద్‌, గోవా, దిల్లీ ఎన్‌సీఆర్‌.

కాల వ్యవధి: రెండేళ్లు/ ఏడాది

విభాగాలు: అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ-ఏసీఎం), ప్రాజెక్ట్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ-పీఈఎం) తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: నిక్‌మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఎన్‌సీఏటీ), పర్సనల్‌ ఇంటర్వ్యూల ఆధారంగా.

పరీక్ష తేది: 2021 జులై 03,  04.

పర్సనల్‌ ఇంటర్వ్యూ తేది: 2021 జులై 06, 07.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.

దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 29, 2021.

వెబ్‌సైట్‌: https://nicmar.ac.in/


ఐసీఐలో బీబీఏ, ఎంబీఏ

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ (ఐసీఐ), అమర్‌కంఠక్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ సంయుక్తంగా 2021 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నాయి.

కోర్సులు: బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ)

అందిస్తున్న ప్రాంగణాలు: తిరుపతి, నోయిడా.

అర్హత: ప్రోగ్రాముని అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేది: జులై 15, 2021.

వెబ్‌సైట్‌: http://thims.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని