నోటిఫికెషన్స్

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ దేశవ్యాప్తంగా ఉన్న తమ కేంద్రాల్లో 530 ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 24 Oct 2022 06:45 IST

ఉద్యోగాలు

ఏపీ న్యాయస్థానాల్లో కొలువులు

ఆంధ్రప్రదేశ్‌లోని కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి. జిల్లా కోర్టుల్లో 3,432, హైకోర్టులో 241 పోస్టులతో మొత్తం 3,673 పోస్టుల భర్తీకి వేర్వేరుగా 19 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలో ఆఫీస్‌ సబార్డినేట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ప్రాసెస్‌ సర్వర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ అండ్‌ ఎగ్జామినర్‌, స్టెనోగ్రాఫర్‌ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి.

అర్హతలు: పోస్టును అనుసరించి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్‌రైటింగ్‌/ స్టెనో సర్టిఫికెట్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్స్‌.

వయసు: 01/07/2022 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400).

ఎంపిక: పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: హైకోర్టు ఖాళీలకు 25.10.2022 నుంచి 15-11-2012; జిల్లా కోర్టు ఖాళీలకు 11-11-2022 వరకు.

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in


సీడ్యాక్‌లో 530 ప్రాజెక్టు పోస్టులు

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ దేశవ్యాప్తంగా ఉన్న తమ కేంద్రాల్లో 530 ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 30 పోస్టులు

2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 250 పోస్టులు

3. ప్రాజెక్ట్‌ మేనేజర్‌/ ప్రోగ్రామ్‌ మేనేజర్‌/ ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌/ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌: 50 పోస్టులు

4. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌/ మాడ్యూల్‌ లీడ్‌/ ప్రాజెక్ట్‌ లీడ్‌: 200 పోస్టులు

అర్హతలు: బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.  

ఎంపిక: రాత/స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28-10-2022.

వెబ్‌సైట్‌: https://careers.cdac.in


డిప్యూటీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఖాళీలు

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన గ్రూప్‌ బి, నాన్‌-గెజిటెడ్‌ గ్రేడులో 15 డిప్యూటీ ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి న్యూదిల్లీలోని క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు: డిగ్రీ, డిప్లొమా(చైనీస్‌ భాష)/ డిగ్రీ (చైనీస్‌ భాష) ఉత్తీర్ణత.

వయసు: 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పోస్ట్‌ బ్యాగ్‌ నెం.001, లోధి రోడ్‌, హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, న్యూదిల్లీ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 21.11.2022.

వెబ్‌సైట్‌:  https://cabsec.gov.in/


సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ-ఏపీలో...

ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ 12 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, యూడీసీ, స్టెనోగ్రాఫర్‌, సెక్యూరిటీ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హతలు: పోస్టును అనుసరించి 12వ తరగతి/ ఇంటర్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత. నెట్‌/ స్లెట్‌/ సెట్‌లో అర్హత.

వయసు: 30-40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష/ అటెండింగ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.2000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.11.2022

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2022

వెబ్‌సైట్‌: https://www.ctuap.ac.in/category/recruitment/


ఎన్‌టీఆర్‌ఓ-న్యూదిల్లీలో...

న్యూదిల్లీకి చెందిన నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీఆర్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన 125 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌, రిస్క్‌ అనలిస్ట్‌, నెట్‌వర్క్‌ అడ్మిన్‌, సిస్టమ్‌ స్పెషలిస్ట్‌, కన్సల్టెంట్‌, రిమోట్‌ సెన్సింగ్‌ డేటా స్పెషలిస్ట్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ కన్సల్టెంట్‌, సెక్యూరిటీ కన్సల్టెంట్‌, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ కన్సల్టెంట్‌, టీమ్‌ లీడర్‌, ఫర్మ్‌వేర్‌ రివర్స్‌ ఇంజినీర్‌, జియోస్పేషియల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అర్హత: పోస్టును అనుసరించి బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంసీఏ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 30-62 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌, అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07.11.2022.

వెబ్‌సైట్‌: https://ntro.gov.in/ntroWeb/loadRecruitmentsHome.do


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని