నోటిఫికేషన్స్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం లఖ్‌నవూలోని సెంటర్‌ ఆఫ్‌ బయో మెడికల్‌ రిసెర్చ్‌ (సీబీఎంఆర్‌) వివిధ విభాగాల్లో 11 ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 24 Nov 2022 04:57 IST

ఉద్యోగాలు

సీబీఎంఆర్‌లో ప్రొఫెసర్‌ పోస్టులు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం లఖ్‌నవూలోని సెంటర్‌ ఆఫ్‌ బయో మెడికల్‌ రిసెర్చ్‌ (సీబీఎంఆర్‌) వివిధ విభాగాల్లో 11 ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 10 పోస్టులు
* ప్రొఫెసర్‌: 01 పోస్టు

విభాగాలు: బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ డివైజెస్‌, డేటా సైన్సెస్‌, అడ్వాన్స్‌డ్‌ స్పెక్ట్రోస్కోపీ అండ్‌ ఇమేజింగ్‌, సిస్టమ్స్‌ బయాలజీ, బయోలాజికల్‌ అండ్‌ సింథటిక్‌ కెమిస్ట్రీ.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వేతన శ్రేణి: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,01,500 - రూ.1,67,400; ప్రొఫెసర్‌కు రూ.1,59,100 - రూ.2,20,200 చెల్లిస్తారు.
వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 40 ఏళ్లు, ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డైరెక్టర్‌, సెంటర్‌ ఆఫ్‌ బయో మెడికల్‌ రిసెర్చ్‌, రాయ్‌బరేలి రోడ్‌, లఖ్‌నవూ, ఉత్తర్‌ప్రదేశ్‌’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 19.12.2022.
వెబ్‌సైట్‌:http://cbmr.res.in/

టీఎస్‌ సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌లో..

తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ జావా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ, ఎంఎస్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్‌). బీఎస్సీ/ బీసీఏ, ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఫిజిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌)తో పాటు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో రెండేళ్ల పని అనుభవం. కోర్‌ జావా/ జే2ఈఈ/ సర్వ్‌లెట్స్‌/ జేఎస్‌పీ/ జావాస్క్రిప్ట్‌, ఓఓపీఎస్‌, స్టట్స్ర్‌ ఫ్రేమ్‌వర్క్‌పై పరిజ్ఞానం.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2022
వెబ్‌సైట్‌: https://www.cgg.gov.in/career/walknjavan/~oftwarendeveloper/

సిపెట్‌, చెన్నైలో టెక్నికల్‌ కొలువులు

కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింది గ్రూప్‌-ఎ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సూపర్‌వైజరీ (టెక్నికల్‌) పోస్టులు:
* మేనేజర్‌ (టెక్నికల్‌): 04
సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌: 06  
* టెక్నికల్‌ ఆఫీసర్‌: 10
* సూపర్‌వైజరీ (నాన్‌-టెక్నికల్‌) పోస్టు
* మేనేజర్‌ (పీఅండ్‌ఏ): 1
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, నైపుణ్యం/ ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తు, అవసరమైన ధ్రువపత్రాల నకళ్లను ‘డైరెక్టర్‌ (అడ్మినిస్ట్రేషన్‌) కార్యాలయం, సిపెట్‌ ప్రధాన కార్యాలయం, టీవీకే ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, గిండి, చెన్నై’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-12-2022.
వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/


అప్రెంటిస్‌షిప్‌

290 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

రాజస్థాన్‌ రాష్ట్రం ఖేత్రీ నగర్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌, ఖేత్రీ కాపర్‌ కాంప్లెక్స్‌ ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్‌ అప్రెంటిస్‌: 290 పోస్టులు
ట్రేడ్‌: మేట్‌ (మైన్‌), బ్లాస్టర్‌ (మైన్‌), డీజిల్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, టర్నర్‌, వెల్డర్‌ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మన్‌ (సివిల్‌), డ్రాఫ్ట్స్‌మన్‌ (మెకానికల్‌), కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, సర్వేయర్‌, రెఫ్రిజెరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనర్‌.
అర్హత: 10వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఐటీఐ, పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12.12.2022.
ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 31.12.2022.
వెబ్‌సైట్‌: //www.hindustancopper.com/


వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

పీసీఐఎంహెచ్‌, ఘజియాబాద్‌లో...

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌లోని ఫార్మాకోపోయియా కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్‌ అండ్‌ హోమియోపతి (పీసీఐఎం అండ్‌హెచ్‌) కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ దరఖాస్తులు కోరుతోంది.
* ఫార్మకోపోయియా అసోసియేట్‌: 06 పోస్టులు
* ఆఫీస్‌ అసిస్టెంట్‌: 10 పోస్టులు
* టెక్నికల్‌ డేటా అసోసియేట్‌: 04 పోస్టులు
* డ్రైవర్‌: 01 పోస్టు
* హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌: 07 పోస్టులు
* కన్సల్టెంట్‌: 05 పోస్టులు
* హిందీ ట్రాన్స్‌లేటర్‌: 01 పోస్టు
* ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌: 04 పోస్టులు
* ఎంటీఎస్‌: 34 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 72
అర్హత: పోస్టును అనుసరించి 5వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ.
ఎంపిక: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 05.12.2022.
వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: 10-12-2022.
వేదిక: కమిటీ రూమ్‌, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, ఫార్మకోపోయియా కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ మెడిసిన్‌ అండ్‌ హోమియోపతి, మినిస్ట్రీ ఆఫ్‌ ఆయుష్‌, కమలా నెహ్రూ నగర్‌, ఘజియాబాద్‌, ఉత్తర్‌ప్రదేశ్‌. వెబ్‌సైట్‌:  https://www.becil.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని