సోషల్‌ వర్క్‌లో పీహెచ్‌డీ ఎలా?

సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ చేశాను. దేశ విదేశాల్లో పీహెచ్‌డీని దూరవిద్యావిధానంలో చేసే వీలుందా? సోషల్‌ వర్క్‌ చదివినవారికి ఉన్న ఉద్యోగావకాశాలేమిటి?

Updated : 30 Apr 2020 00:52 IST

సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ చేశాను. దేశ విదేశాల్లో పీహెచ్‌డీని దూరవిద్యావిధానంలో చేసే వీలుందా? సోషల్‌ వర్క్‌ చదివినవారికి ఉన్న ఉద్యోగావకాశాలేమిటి?

- సతీష్‌ కుమార్‌●

* సంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీని దూరవిద్య ద్వారా చేసే అవకాశం లేదు. ఓపెన్‌ యూనివర్సిటీలు పీహెచ్‌డీని డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో అందిస్తున్నాయి. ప్రధానంగా ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ సోషల్‌ వర్క్‌లో పీహెచ్‌డీని నిర్వహిస్తోంది. విదేశాల్లోనూ పీహెచ్‌డీని దూరవిద్యలో చేయడానికి కుదరదు. ఏ దేశంలోనైనా ఏవైనా విశ్వవిద్యాలయాలు పీహెచ్‌డీని దూరవిద్య ద్వారా అందిస్తుంటే, ప్రపంచ ర్యాంకుల్లో ఆ విశ్వవిద్యాలయాల పరిస్థితి పరిశీలించాలి. కొన్ని నకిలీ యూనివర్సిటీలు పీిహెచ్‌డీ పేరుతో మభ్యపెట్టి డబ్బు చెల్లించమని ఒత్తిడి చేస్తాయి. అవి గుర్తింపు లేని పట్టాను అంటగట్టే ప్రమాదం ఉంది. అందుకే పీహెచ్‌డీని ఎప్పుడూ ఫుల్‌టైమ్‌ కోర్సుగా చేయాలి. సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసినవారికి మహిళా శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, కార్మిక సంక్షేమ శాఖ, జైళ్ల శాఖ, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యాసంస్థలు, కర్మాగారాల్లోని మానవ వనరుల విభాగాలు, పరిశోధనా సంస్థలు, కన్సల్టెన్సీ సర్వీసెస్‌ల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పునరావాసం, కౌన్సెలింగ్‌, దారిద్య్ర నిర్మూలన లాంటి రంగాల్లోనూ జాబ్‌ దొరుకుతుంది. ఇంకా అవకాశాలను పెంచుకోవాలంటే సోషల్‌వర్క్‌ పీహెచ్‌డీతోపాటు సైకాలజీ, మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌, ఎడ్యుకేషన్‌ లాంటి సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌ లేదా డిప్లొమా కోర్సులు చేయవచ్ఛు వీటన్నింటితో పాటు భావప్రకటన సామర్ధ్యం, నాయకత్వ లక్షణాలు, టీం వర్క్‌లో మెలకువలను పెంపొందించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని