ఏ కోర్సులు చేస్తే ప్రయోజనం?

బీఎస్సీ ఎలక్ట్ట్రానిక్స్‌ పూర్తిచేశాను. ఏ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు పొందొచ్చు?

Updated : 16 Nov 2020 03:39 IST

బీఎస్సీ ఎలక్ట్ట్రానిక్స్‌ పూర్తిచేశాను. ఏ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు పొందొచ్చు? - జి. యశ్వంత్‌.
మీరు కోడింగ్‌, పైతాన్‌ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌, డేటా సైన్స్‌, ఐఓటీ¨, వెబ్‌ డిజైన్‌, ఆండ్రాయిడ్‌ ఆప్‌ డెవలప్‌మెంట్‌, పీసీబీ డిజైన్‌లలో శిక్షణ తీసుకొంటే మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఇవే కాకుండా సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) వారు అందించే మాట్‌ ల్యాబ్‌, మైక్రో కంట్రోలర్‌ ప్రోగ్రామింగ్‌, వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, అడ్వాన్స్‌డ్‌ ఎంబెడెడ్‌ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ డిజైన్‌, డీప్‌ లెర్నింగ్‌, సిస్టమ్‌ వేరిలాగ్‌, ఎస్‌టీడీ సెల్‌ డిజైన్‌, ఐసీ ఫిజికల్‌ డిజైన్‌, హెచ్‌డీఎల్‌ సింథసిస్‌, మాట్‌ ల్యాబ్‌- డీఎస్‌పీ, మాట్‌ ల్యాబ్‌-ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, మెకట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఎక్విప్‌మెంట్‌ రిపేరింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్‌, రోబోటిక్స్‌ లాంటివాటిలో నచ్చిన కోర్సు చేస్తే మంచి ఉద్యోగాలను పొందవచ్చు. సీ- డాక్‌ సంస్థ కూడా ఎలక్ట్ట్రానిక్స్‌ చదివినవారికి కొన్ని సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్త్తోంది. వీటితో పాటు కొన్ని యూనివర్సిటీల్లో పీజీ డిప్లొమా ఇన్‌ టెలికమ్యూనికేషన్‌ కోర్సు చేసేఅవకాశం ఉంది.

- బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని