ఐటీ ఎంచుకోవచ్చా?

బీడీఎస్‌ చేశాను. మూడేళ్లు పనిచేసి మానేశాను. ఇప్పుడు ఐటీ వైపు వెళ్లాలనుకోవడం సరైనదేనా? కెనడా/ యూఎస్‌లో మెడికల్‌ కోడింగ్‌ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

Published : 22 Feb 2022 00:54 IST

బీడీఎస్‌ చేశాను. మూడేళ్లు పనిచేసి మానేశాను. ఇప్పుడు ఐటీ వైపు వెళ్లాలనుకోవడం సరైనదేనా? కెనడా/ యూఎస్‌లో మెడికల్‌ కోడింగ్‌ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

- ప్రణవి


టీ ఉద్యోగాల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. హెల్త్‌కేర్‌కు సంబంధించిన ఐటీ కంపెనీల్లో కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు మెడికల్‌/ డెంటల్‌ చదివినవారికీ అర్హత ఉంటుంది. అలాంటి సంస్థలను ఎంచుకొని, వాటిలో ఉద్యోగాలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ పొంది ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. ప్రస్తుతం అనలిటిక్స్‌ రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువున్నాయి. ఆ  దిశలో కూడా ప్రయత్నం చేయండి.

మెడికల్‌ కోడింగ్‌ రంగంలో కంటే, హెల్త్‌కేర్‌ ఐటీ రంగానికే మంచి భవిష్యత్తు ఉంది. మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ఉద్యోగాలకోసం సర్టిఫికేషన్‌ ఇన్‌ మెడికల్‌ కోడింగ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం, సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ కోడర్‌ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం, అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేషన్‌ ఇన్‌ మెడికల్‌ కోడింగ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం లాంటి కోర్సుల్లో శిక్షణ పొందాలి. కెనడా/యూఎస్‌లో మెడికల్‌ కోడింగ్‌ కోర్స్‌ చేసి, ఆ దేశాల్లోనే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే మెరుగైన అవకాశాలుంటాయి. మెడికల్‌ కోడింగ్‌లో వృత్తి అనుభవం ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తారు. మొదటి ఉద్యోగం తక్కువ వేతనంతో మొదలైనా, అనుభవం పెరిగే కొద్దీ వేతనం పెరుగుతుంది. మీకు ఆసక్తి ఉంటే ఎంబీఏ హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివి, ఆ రంగంలో కూడా మెరుగైన ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని